Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమిగ్ పూల్ .. లోతు లోయంత !
By: Tupaki Desk | 9 July 2021 11:30 PM GMTస్విమింగ్ అంటే దాదాపుగా అందరికి ఇష్టమే ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూరి వారికి స్విమింగ్ అంటే అమితమైన ఇష్టం. పల్లెటూర్లలో ఉండే చెరువుల్లో , బావుల్లో , కుంటల్లో , డ్యాముల్లో స్విమ్ చేస్తుంటారు. అయితే పట్నం లో ఉండేవారికి మాత్రం స్విమింగ్ ఫూల్స్ మాత్రమే దిక్కు. చాలామంది హాలిడేస్ వస్తే చాలు ఎంజాయ్ చేయడానికి స్విమింగ్ పూల్ కి వెళ్తుంటారు. అయితే , అలాంటివారికి ఓ గుడ్ న్యూస్ .. ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమింగ్ పూల్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఆ అత్యంత లోతైన స్విమింగ్ పూల్ ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా ! ఆ స్విమింగ్ పూల్ దుబాయ్ లో తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చారు. దుబాయ్ ఓ భూతల స్వర్గం. ఆకాశాన్ని తాకే భవనాలను చూస్తే కళ్లు చెదిరిపోతాయి. దుబాయ్ ఏం చేసినా ఓప్రత్యేకత ఉంటుంది. అటువంటిదే మరో అత్యద్భుతమైన పూల్ ను నిర్మించింది. ఈ పూల్ ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్. 'డీప్ డైవ్ దుబాయ్’గా పిలుస్తున్న ఈ పూల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
ఇది గిన్నిస్ రికార్డు కూడా సాధించింది. నాడ్ అల్ షెబా ప్రాంతంలో నిర్మితమైన ఈ స్విమ్మింగ్ పూల్ ను దుబాయ్ యువరాజు హమ్ దాన్ బిన్ మొహమ్మద్ ప్రారంభించారు. అనంతరం ఈ పూల్ కి సంబంధించిన వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 60 మీటర్ల లోతున్న (196 అడుగులు) ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన పూల్ డీప్ డైవ్ దుబాయ్ మీ కోసం ఎదురుచూస్తోందని ఆయన ట్విటర్ లో పేర్కొన్నారు. ఈ పూల్‌ను ముఖ్యంగా డైవింగ్ లో శిక్షణ తీసుకునే వారికోసం, నీటి లోతట్టు ప్రాంతాల్లో డైవింగ్ చేసే ఆసక్తి కలిగిన వాళ్ల కోసం ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ పూల్‌లోపల ఓ నగరం కూడా ఉందంటే దాని రేంజ్ ఏంటీ ఊహించుకుంటేనే దాంట్లో ఈత కొట్టలేకపోయినా ఒక్కసారైనా చూసి తీరాలనిపిస్తుంది. మామూలు స్విమ్మింగే కాదు ఏకంగా సముద్రాల్లో చేసినట్లుగా ఈ పూల్ లో స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు. అంత భారీగా ఉంది మరి ఈ 'డీప్ డైవ్ దుబాయ్'. ఈ పూల్ లో ఓ అపార్ట్‌మెంట్, గ్యారేజ్, ఆర్కేడ్ ఉన్నాయి. ఫ్రీ డైవింగ్, స్కూబా డైవింగ్ చేయాలనుకునే అవి రాకపోతే వారికి సహాయం చేయటానికి ఇక్కడ ఇంటర్నేషనల్ డైవింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. ఈ పూల్‌లో ఉన్న 56 కెమెరాలు డైవింగ్ చేస్తున్న వారిని నిరంతం పర్యవేక్షిస్తుంటాయి. ఇందులోని నీరు 6 గంటలకు ఒక సారి శుద్ధి చేస్తారు. దీన్ని నింపడానికి 1.4 కోట్ల లీటర్ల నీటిని వినియోగించారు. నీటిని శుద్ధి చేయడానికి నాసా అభివృద్ధి చేసిన అధునాత వడపోత సాంకేతికతను ఉపయోగించినట్టు పూల్ నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే సందర్శకులకు అనుమతి ఉంటుందని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఈత కొట్టడానికి దిగితే ఒక పాతాళలోకానికి వెళ్లిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. స్విమ్మింగ్ పూల్ కింది భాగంలో గేమ్స్ ఆడుకోవడానికి, కూర్చొడానికి తగిన ఏర్పాట్లు చేశారు. దీనిని ఒక మాయాలోకం మాదిరిగా తీర్చిదిద్దారు.
బుకింగ్స్ ఎలా అంటే ఈ డీప్ డైవ్ దుబాయ్ ప్రస్తుతం కేవలం ఆహ్వానితులకు మాత్రమే అందుబాటులో ఉంది. సాధారణ ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నెల చివరిలోగా బుకింగ్స్ చేసుకునే అవకాశం లభించనుంది. వాళ్ల వెబ్ సైట్ లోనే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. పదేళ్లు పైబడిన వారికి మాత్రమే అనుమతిస్తారు. బిగినర్స్ తోపాటు ఫ్రొపెషనల్ డైవర్లు, అథ్లెట్లు కూడా ఈ పూల్ ను సందర్శించవచ్చు.
https://twitter.com/HamdanMohammed/status/1412794948500533254?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1412794948500533254|twgr^|twcon^s1_&ref_url=https://tv9telugu.com/odd-news/the-deepest-swimming-pool-in-dubai-awesome-watching-video-497343.html