Begin typing your search above and press return to search.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో యూటర్న్.. ఏం జరిగిందంటే!
By: Tupaki Desk | 8 Nov 2022 4:09 AM GMTఢిల్లీ సహా రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రస్థాయిలో కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం(స్కాం) కేసు యూటర్న్ తిరిగింది. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో తాజాగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నాయకుడు మనీష్ సిసోడియాపై సీబీఐ కేసులు కూడా నమోదు చేసింది. ఆయనను విచారించింది కూడా. అదేవిదంగా ఆయన ఇంట్లోనూ ఆఫీసుల్లోనూ సోదాలు కూడా నిర్వహించింది. దీంతో ఇది రాజకీయంగా యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. తెలంగాణలో సీఎం కుమార్తె కవిత పాత్ర కూడా ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.
ఇన్ని ట్విస్టులు ఉన్న ఈ కేసులో తాజాగా మరో యూటర్న్ చోటు చేసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా ప్రధాన అనుచరుడు దినేశ్ అరోరా అప్రూవర్గా మారారు. ఈ మేరకు సీబీఐ కోర్టుకు ఆయన నివేదించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారి..
వాస్తవాలు బయటపెడతానని విచారణ సందర్బంగా న్యాయమూర్తికి వివరించారు. ఈ విషయంలో ఏదైనా ఒత్తిడి ఉందా అని జడ్జి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. సీబీఐ నుంచి గానీ, ఇతరుల నుంచి గానీ తనపై ఎలాంటి ఒత్తిడి లేదని దినేశ్ అరోరా స్పష్టం చేశారు.
సున్నితమైన ఈ కేసు విచారణకు మీడియాను దూరంగా ఉంచాలని అరోరా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అందుకు సీబీఐ కూడా అంగీకరించింది. అయితే దినేశ్ అరోరాను అప్రూవర్‌గా అంగీకరించడంపై ఈనెల 14న తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జడ్జి ఎంకే నాగ్పాల్ ప్రకటించారు.
ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలన్న అరోరా పిటిషన్‌పైనా అదేరోజు వాదనలు వింటామని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి విషయాలపై అరోరా ఎలాంటి సంగతులు వెల్లడిస్తాడోననే ఉత్కంఠ నెలకొంది. మరి ఏం జరుగుతుందో.. ఎవరికి మూడుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.