Begin typing your search above and press return to search.

ఇసుక పై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు !

By:  Tupaki Desk   |   11 Aug 2020 8:24 AM GMT
ఇసుక పై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు !
X
నిర్మాణ రంగంలో చాలా కీలకమైన ఇసుకపై జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక తవ్వకాలు, రవాణా సరఫరా క్రమబద్ధీకరణల పై తాజా ఉత్తర్వులు జారీ చేసింది. తవ్వకాలు, రవాణా సరఫరా క్రమబద్ధీకరణలపై క్లారిటీ ఇచ్చింది. ఇసుక తవ్వకాలు, లోడింగ్‌, రవాణా, డోర్‌ డెలివరీకి బేస్‌ రేట్లు నిర్ణయిస్తూ ఏపీ గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెన్‌ రీచ్‌ లు, పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకానికి టన్నుకు రూ.90గా నిర్ణయించింది. ఇక జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్‌ రుసుము టన్నుకు రూ.25గా నిర్ధారించారు. ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వసూలు చేయనున్నారు.

ఇసుకకు రవాణాకు సంబంధించిన ఈ ధరలు 40 కిలోమీటర్ల దూరం వరకు వర్తిస్తాయని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. 40 కిలోమీటర్లు దాటితే ప్రతి టన్నుకు అదనంగా రూ.4.90ల చొప్పున వసూలు చేయనుంది. గోదావరి జిల్లాల నుంచి విశాఖకు ఇసుక రవాణా టన్నుకు జీఎస్టీతో కలిపి కిలోమీటర్ రూ.3.30గా.. డోర్‌ డెలివరీ కోసం 10 కిలోమీటర్లలోపు దూరానికి ట్రాక్టర్‌ ద్వారా టన్నుకు రూ.10, లారీ ద్వారా టన్నుకు రూ.8, పెద్ద లారీకి టన్నుకు రూ.7 ప్రభుత్వం వసూలు చేయనున్నారు.ఇసుక కొత్త ధరలపై ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఏపీ ప్రభుత్వం సూచనలు చేసింది.