Begin typing your search above and press return to search.
హైకోర్టు ఆదేశంతో దిశ నిందితుల మృతదేహాల ఖననానికి బ్రేక్
By: Tupaki Desk | 7 Dec 2019 5:36 AM GMTదిశ నిందితులపై జరిగిన ఎన్ కౌంటర్ రేపిన సంచలనం ఒకవైపు.. ప్రజల హర్షాతిరేకాలు మరోవైపు సాగుతున్నాయి. ఇలాంటివేళ.. హైకోర్టు అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది. ఎన్ కౌంటర్ పై జ్యుడీషియల్ విచారణ జరపాలని.. నలుగురి మృతదేహాలకు స్వతంత్ర నిపుణులతో మళ్లీ పోస్టుమార్టం చేయించాలని కోరుతూ ప్రజా సంఘాలు.. మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు రియాక్ట్ అయ్యింది.
ఈ పిటీషన్ పై విచారణను తొమ్మిదో తేదీన జరుపుతామని చెప్పిన హైకోర్టు.. ఎన్ కౌంటర్ అయిన మృతదేహాలకు అంత్యక్రియలు జరపరాదని ఆదేశాలు జారీ చేసింది. ఎన్ కౌంటర్ మృతులకు చేసిన పోస్టు మార్టం నివేదికను పెన్ డ్రైవ్ లేదంటే సీడీ రూపంలో ఇవ్వాలని పేర్కొంది.
దిశపై జరిగిన హత్యాచారం నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ జరిగిన ఎన్ కౌంటర్ పై పలు సందేహాలు ఉన్నట్లుగా పిటిషన్ దారులు పేర్కొన్నారు. మరోమారు పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశాయి. ఇదిలా ఉంటే.. పోస్టు మార్టం జరిగిన తీరుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు శవాలు ఆసుపత్రికి వచ్చాయి. గాంధీ ఆసుపత్రి వైద్యులు స్థానిక ఫోరెన్సిక్ విబాగం వారితో సంబంధం లేకుండా పోస్ట్ మార్టం మొదలైంది.
దీంతో కొంత వివాదం నెలకొంది. జిల్లా జడ్జి ప్రేమావతి సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను సైతం రాకుండానే పోస్టు మార్టం ప్రక్రియను ఎలా మొదలు పెడతారని ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సాగిన పోస్టుమార్టం.. అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు ఇవ్వాలనుకున్నారు. అయితే.. తాము చెప్పే వరకూ అంత్యక్రియలు నిర్వహించొద్దని జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశించటంతో ప్రభుత్వం అప్పగింత ప్రక్రియను నిలిపివేసింది. ప్రస్తుతం డెడ్ బాడీస్ ను ఫ్రీజర్లలో భద్రపరిచి.. మార్చురీలో తాళం వేసి ఉంచేశారు. హక్కుల సంఘం.. కోర్టు నిర్ణయం తర్వాత మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పజెప్పనున్నారు.