Begin typing your search above and press return to search.

ఆపరేషన్ చేసేందుకు 3 కి.మీలు పరిగెత్తిన డాక్టర్

By:  Tupaki Desk   |   12 Sep 2022 11:30 PM GMT
ఆపరేషన్ చేసేందుకు 3 కి.మీలు పరిగెత్తిన డాక్టర్
X
అసలే బెంగళూరు.. ఈ మధ్యన వచ్చిన వరదలు తగ్గలేదు. ఈ క్రమంలోనే కారులో వెళుతుంటే ట్రాఫిక్ జాం.. అక్కడ ఆపరేషన్ చేయకపోతే పేషంట్ చనిపోవచ్చు. దీంతో ఆ డాక్టర్ సహసమే చేశాడు. ట్రాఫిక్ లో 3 కి.మీలు పరుగులు తీసి మరీ ఆస్పత్రికి వెళ్లి సర్జరీ చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత తక్కువచెప్పుకుంటే అంత మంచిది. ఇరుకైన రోడ్లతో గంటల కొద్దీ ట్రాఫిక్ జాంలో పడి వాహనదారులు నలిగిపోతుంటారు. దీనిపై దేశవ్యాప్తంగా వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు బెంగళూరు ట్రాఫిక్ లో ఇరుక్కుంటే రోగులకు చికిత్స అందక చనిపోవడమే..అంతటి భయానక పరిస్థితులు బెంగళూరులో ఉన్నాయి.

బెంగళూరులో తాజాగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 30న నగరంలో మారత్పల్లి స్ట్రైచ్ సర్జాపూర్ లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అర్జంటుగా సర్జరీ చేయాల్సి ఉండగా.. ట్రాఫిక్ జామ్ తో ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి. ట్రాఫిక్ ఉంది కదా అని ఆయన కారులో కూర్చోలేదు. కారు దిగి 3 కిలోమీటర్లు పరిగెత్తి ఆస్పత్రికి వెళ్లి మరీ సర్జరీ చేశాడు. ఆగస్టు 30న ఈ ఘటన జరిగింది.

మణిపాల్ హాస్పిటల్ లో గ్యాస్ట్రో ఎంటరోలాజీ సర్జన్ గా పనిచేస్తున్న డా.గోవింద్ నందకుమార్.. ఆరోజున ఓ మహిళా రోగికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. సరైన సమయంలో ఇంటినుంచి బయలు దేరినా.. సర్జాపూర్-మరాథల్లి ప్రాంతానికి వెళ్లేసరికి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడు. ఆలస్యమైతే రోగి ప్రాణానికే ప్రమాదం అని భావించిన డా. గోవింద్ నందకుమార్ తన కారును అక్కడే వదిలేసి 3 కిలోమీటర్లు పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ బెంగళూరు వైద్యుడి సాహసానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

ఉద్యోగంపై ఉన్న అంకితభావంతో కారు తీసి పరుగులు తీసిన బెంగళూరు వైద్యుడు సరైన సమాయానికి ఆస్పత్రికి వెళ్లి సర్జరీని పూర్తి చేశాడు. సర్జరీ సక్సెస్ అయ్యింది. సరైన సమాయానికి ఆస్పత్రికి వచ్చి ఆపరేషన్ చేసిన వైద్యుడికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.