Begin typing your search above and press return to search.
దొంగలకు ఆ దేశాల తలుపులు తెరిచే ఉంటాయి!
By: Tupaki Desk | 7 Jun 2021 6:30 PM GMTమన దేశంలోని బ్యాంకుల నుంచి వేలాది కోట్లు దోచుకొని, ఆంటిగ్వాకు పారిపోయిన మోహుల్ చోక్సీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్. అతన్ని ఇండియాకు తీసుకు రావడం సాధ్యమవుతుందా? అన్న చర్చ జోరుగానే సాగుతోంది. రావడానికి ఉన్న ఛాన్స్ ఎంత? రాకపోవడానికి ఉన్న అవకాశాలేంటీ? అనే డిస్కషన్ సాగుతోంది. డొమెనికా కోర్టు.. ఛోక్సీ కేసును జులైకి వాయిదా వేయడంతో.. ఏం జరుగుతుందన్నది అప్పుడు చూడాలి. అది అలా ఉంచితే.. లలిత్ మోడీ కావొచ్చు, చోక్సీ కావొచ్చు.. ఇతర దేశాల నుంచి మరికొందరు ఆర్థిక నేరగాళ్లు కావొచ్చు.. టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ల డెస్టినేషన్ ఏంటో తెలుసా? చలో కరీబియన్ కంట్రీస్.
సొంత దేశాల నుంచి వేలు, లక్షల కోట్లు దోచుకున్న వారు.. తాము పారిపోవడానికి కరీబియన్ కంట్రీస్ ఎంచుకుంటున్నాయి. ఈ దేశాలనే వీళ్లు ఎందుకు సెలక్ట్ చేసుకుంటున్నారు? అన్నది ప్రధాన ప్రశ్న. నేరగాడెప్పుడూ సేఫ్ జోనే చూసుకుంటాడు కదా! ఆ విధంగా కరీబియన్ దేశాలు వాళ్లకు సేఫెస్ట్ ప్లేసెస్ అన్నమాట. మరి, ఇతర దేశాల నేరగాళ్లకు.. ఆ దేశాల్లో ఉన్న భద్రత ఏంటన్నది చూద్దాం.
మొట్ట మొదటిది ఏమంటే.. ఆయా దేశాల్లో ఉన్నవారికి పౌరసత్వం ఈజీగా లభిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే.. స్థానికంగా కనీసం పది పదిహేనేళ్లు నివాసం ఉంటే.. అప్పుడు పౌరసత్వం గురించి ఆలోచిస్తారు. కానీ.. ఈ దేశాల్లో డబ్బులతో పైనై పోతుందని సమాచారం. ఒకవేళ ఏదైనా కారణాలతో ఈ రూట్ లో వర్కవుట్ కాకపోతే ఇంకో దారి కూడా ఉంది. మీ దేశంలో పెట్టుబడి పెట్టబోతున్నాం అని వెళ్తే సరి.. రాజమార్గంలో రెడ్ కార్పెట్ వేసి పౌరసత్వం చేతిలో పెడతారు.
ఎలాగో.. వేల కోట్లు దోచుకొని ఉంటారు కాబట్టి.. కొన్ని కోట్లు ఖర్చు చేసి ఫ్యాక్టరీలో, కంపెనీలో పెట్టడం వీళ్లకు పెద్ద సమస్య కాదు. పైగా.. దాన్నుంచి వచ్చే ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇటు పౌరసత్వం ఈజీగా లభిస్తుంది. మూడోది ఏమంటే.. ద్వంద్వ పౌరసత్వాన్ని కూడా ఆ దేశాలు అనుమతిస్తుంటాయి. అంటే.. వాళ్ల దేశ పౌరుడిగా కొనసాగుతూ.. మరో దేశంలో కూడా పౌరుడిగా ఉండొచ్చు. అంతేకాదు.. ఈ దేశాల్లో పౌరసత్వం తీసుకుంటే.. దాదాపు 160 దేశాలకు వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. ఈ విధంగా.. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకే.. నేరగాళ్లు ఈ దేశాలను సెలక్ట్ చేసుకుంటున్నారట.
దేశం నుంచి పారిపోవాలని ముందుగానే ప్లాన్ వేసుకుని ఉంటారు కాబట్టి.. దానికన్నా ముందే పౌరసత్వం తీసుకోవడం.. తాము దోచుకున్న డబ్బులను ఆయా దేశాలకు తరలించడం అన్నీ చేసేస్తారు. అంతా క్లియర్ అనుకున్న తర్వాత వన్ ఫైన్ డే చూసుకొని.. వీళ్లు కూడా టాటా చెప్పకుండానే వెళ్లిపోతారు. ఈ విధంగా నేరగాళ్లు సెలక్ట్ చేసుకునే కరీబియన్ కంట్రీస్, ఆంటిగ్వా, సెయింట్ లూసియినా,ఆ సెయింట్ కిట్స్, గ్రెనడా, బార్బొడాస్ వంటివి చాలా ఉన్నాయి. అందుకే.. ఈ దేశాలు విస్తీర్ణంలో చాలా చిన్నవే అయినా.. ఈ విధమైన పేరుకు పెద్ద దేశాలే. అందుకే నేరగాళ్లు ఈ దేశాలను ఎంచుకుంటున్నారు.