Begin typing your search above and press return to search.

వైరస్ ప్రభావం తగ్గుతుందట..ఎవరు చెప్పారంటే?

By:  Tupaki Desk   |   2 Jun 2020 5:15 AM GMT
వైరస్ ప్రభావం తగ్గుతుందట..ఎవరు చెప్పారంటే?
X
వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని చాలాదేశాలని వణికిస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన తరువాత ..ఆ వైరస్ ప్రభావం చూపిన మొదటిదేశం ఇటలీ. ఊహించ‌ని రీతిలో ఆ విప‌త్తును ఎదుర్కొంది ఇట‌లీ. చైనా నుంచి డైరెక్టుగా క‌రోనా వైర‌స్ ఇట‌లీకి ట్రావెల్ అయ్యింద‌ని మొద‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి. వుహాన్ నుంచి ఇటలీకి తోలు ప‌రిశ్ర‌మ వ‌ర్క‌ర్లు, తోళ్లు విప‌రీతంగా ర‌వాణా అవుతుంటాయ‌ని, దీంతో చైనా నుంచి డైరెక్టుగా ఇట‌లీకి వైర‌స్ సోకిందని అయ్యింద‌ని నిపుణులు వివ‌రించారు. ఇటలీ లో వైరస్ ఎలాంటి పరిస్థితి కల్పించింది అంటే .. వృద్ధుల‌కు చికిత్స చేయ‌లేమ‌ని, వ‌య‌సులో ఉన్న వారిని ర‌క్షించుకోవ‌డానికే ప్ర‌య‌త్నాలు అని అక్క‌డి వైద్యులు ఒకానొక సమయంలో ప్రకటించారు.

అలాంటి ప‌రిస్థితి నుంచి ఇట‌లీ నెమ్మ‌ది నెమ్మ‌దిగా కోలుకుంటూ వ‌చ్చింది. అక్క‌డ వైరస్ వ్యాప్తి నెమ్మ‌దిగా ప‌డిపోతూ ఉంది. దాదాపు రెండు ల‌క్ష‌లా ముప్పై మూడు వేల మంది అక్క‌డ వైర‌స్ కు గురికాగా, 33 వేల మంది మ‌ర‌ణించార‌ని అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతానికి ల‌క్షా యాభై ఎనిమిది వేల‌మంది డిశ్చార్జి అయ్యార‌ట‌. ఇక మిగిలిన వారికి చికిత్స కొన‌సాగుతూ ఉంది. కొత్త కేసుల సంఖ్య బాగా త‌గ్గుముఖం ప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఇట‌లీ వైద్య ప‌రిశోధ‌కులు వైరస్ బ‌ల‌హీన ప‌డింద‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

వైరస్ బ‌ల‌హీన ప‌డ‌టం అంటే.. కేసుల సంఖ్య త‌గ్గ‌డ‌మే కాదు, వైర‌స్ బ‌ల‌హీన‌ప‌డింద‌ని వారు అంటున్నారు. వైర‌స్ కు మ‌నిషిని చంపే శ‌క్తి బాగా త‌గ్గిపోయింద‌ని వారు చెబుతున్నారు. రెండు నెల‌ల కింద‌టి నాటి వైర‌స్ స్థితికి ఇప్పుడు దాని స్థితికి తేడా ఉంద‌నివారు చెప్తున్నారు. ఈ మార్పు వ‌ల్ల వైర‌స్ వ‌ల్ల మ‌నిషికి ముప్పు త‌గ్గింద‌నివారు చెబుతున్నారు. మొత్తంగా వైర‌స్ దుష్ట శ‌క్తి బాగా త‌గ్గింద‌ని ఇటాలియ‌న్ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. మరి ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉందో, ఇట‌లీలోనే అలాంటి ప‌రిస్థితి ఉందో ప‌రిశోధ‌కులు చెప్పలేదు. దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే క‌రోనా ప్ర‌భావం ఒక్కో దేశం-ఒక్కో ఖండంలో ఒక్కోలా ఉండ‌టాన్ని మాత్రం గ‌మ‌నించ‌వ‌చ్చు