Begin typing your search above and press return to search.

ఒకడు చేసిన చెత్తపనికి స్వీడన్ లో భారీ హింస

By:  Tupaki Desk   |   30 Aug 2020 4:30 PM GMT
ఒకడు చేసిన చెత్తపనికి స్వీడన్ లో భారీ హింస
X
వాదం ఏదైనా సరే.. దాని గీత దాటకుండా ఉండాలి. కానీ.. పైత్యం ప్రకోపించి.. నెత్తికెక్కిన మతం మత్తులో ఊగిపోయే కొందరి కారణంగా ప్రశాంతంగా ఉండే దేశంలో ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయో తాజాగా యూరప్ లోని సంపన్న దేశమైన స్వీడన్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అక్కడి ఒక మతనాయకుడి అతివాదం దేశానికి కొత్త సమస్యలోకి తీసుకెళ్లటమే కాదు.. హింసతో అట్టుడికిపోయేలా చేస్తోంది.

దేశ బహిష్కరణకు గురైన అతివాదన నాయకుడు.. ముస్లిం వ్యతిరేకి రాస్మస్ పలాడన్ ముస్లింల పవిత్ర గ్రంధంగా భావించే ఖురాన్ ను తగలబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. అతను ఆ దారుణానికి తెగబడకుండా పోలీసులు అడ్డుకున్నారు. కానీ.. సదరు నేత చెంచాలు మాత్రం తాము చేయాలనుకున్న చెత్తపనిని చేసేశారు. దీంతో ఇప్పుడా దేశంలో హింస రాజుకుంది.

రాస్మస్ వర్గీయులు చేసిన పనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో భాగంగా హింస రాజుకుంది. దీంతో దక్షిణ స్వీడన్ నగరం మాల్మో లో ఆందోళనకారులు నిర్వహించిన ఆందోళన గతి తప్పింది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వటంతో వారు గాయపడ్డారు. రోడ్లపై టైర్లు పెట్టి తగులబెట్టి బీభత్సం సృష్టించారు. కొన్ని గంటల పాటు జరిగిన అల్లర్లలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో.. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఈ దారుణానికి కారణమైన రాస్మస్ ను దేశ సరిహద్దుల వద్ద వదిలేసి వచ్చారు.

ఇదిలా ఉంటే తనను రెండేళ్లు దేశం నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంపై అతగాడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. రేపిస్ట్ లు.. హంతకులకు ఎల్లప్పుడు స్వాగతం పలుకుతుంటారు.. తనపై మాత్రం దేశ బహిష్కరణ వేటు వేస్తారా? అని ప్రశ్నించారు. తన వివాదాస్పద వ్యాఖ్యలు.. పనులతో తరచూ తలనొప్పిగా వ్యవహరించే రాస్మస్ స్ట్రామ్ కర్స్ పార్టీ అధినేతగా సుపరిచితుడు. ఇప్పుడు చెలరేగిన హింసను ఎలా సద్దుమణిగేలా చేయాలో అర్థం కాక పోలీసులు తల పట్టుకుంటున్నారు.