Begin typing your search above and press return to search.
బీచ్ లో పడుకున్న యువతి ముఖం ప్లాస్టిక్ లా మారిపోయింది.. కారణమేంటి?
By: Tupaki Desk | 23 Aug 2022 11:30 AM GMTవిహార యాత్ర ఆ యువతికి విషాదయాత్రగా మారింది. అందమైన బీచ్ లో నులివెచ్చని ఎండను ఆస్వాదిస్తూ పడుకున్న పాపానికి ఆమె ముఖం ప్లాస్టిక్ లా మారిపోయింది. విహారంలో బీచ్ ఒడ్డున ఎండలో నిద్రలోకి జారుకున్న ఆ యువతి మరసటి రోజు చూసేసరికి ముఖమంతా ప్లాస్టిక్ లా మారిపోయింది. ఈ వింత సమస్యను చూసి ఏమైందో తెలియక ఆ యువతి భోరుమన్నది.
ఎండలో బీచ్ ఒడ్డున సేదతీరిన ఆ యువతి ముఖం ప్లాస్టిక్ ను వేడిచేస్తే ఎలా మారుతుందో అలా మారింది. బ్యూటీషియన్ గా పనిచేస్తున్న బ్రిటన్ కు చెందిన సిరిన్ మురాద్ (25) అనే యువతి నెల రోజుల క్రితం బల్గేరియాకు విహారయాత్రకు వెళ్లింది. విహారంలో భాగంగా ఓ ఫూల్ వద్ద కూర్చొని అక్కడ కాసేపు కునుకుతీసింది. 30 నిమిషాలకు మేల్కొన్న తర్వాత నుదురు, చెంపలు కాస్త మండినట్లు అనిపించినప్పటికీ పట్టించుకోకుండా మళ్లీ సిరిన్ నిద్రపోయింది. అదే ఆమె కొంప ముంచింది.
మరుసటి రోజు ఆమె ముఖం పై ఉన్న చర్మం కుచించుకుపోయి ప్లాస్టిక్ లా తయారైంది. ఎండలో నిద్రపోవడమే దానికి కారణమని ఆమె భావించింది. సన్ స్క్రీన్ లోషన్ కూడా తాను పెట్టుకోలేదని.. ఇలా ఎలా మారిందో అర్థం కావడం లేదని ఆ యువతి వాపోయింది.
తాను బీచ్ లో నిద్రపోయిన సమయంలో కేవలం 21 డిగ్రీల ఎండమాత్రమే ఉందని.. ఏమైందో తెలియడం లేదని ఆ యువతి తెలిపింది. ఆస్పత్రికి కూడా వెళ్లేందుకు ముఖం చాలలేక సోషల్ మీడియాలో చెప్పుకుంటూ ఆ యువతి బాధపడింది. రోజులు గడిచే కొద్దీ ముఖంపై పగుళ్లు వచ్చినట్టు చెబుతోంది. నొప్పితో బాధ, భయం వేస్తోందని తెలిపింది. ప్రస్తుతం కోలుకున్నట్టు యువతి తెలిపింది. ప్లాస్టిక్ లా మారిన ముఖం.. ఇప్పటికీ సరైన ముఖాన్ని మరోసారి పంచుకుంది.
ఇక ఆమె సన్ స్క్రీన్ లోషన్ రాసుకుందని.. అందుకే అలా అయ్యిందంటూ కొందరు వాదిస్తుననారు. సన్ స్క్రీన్ లోషన్ల ఉపయోగాలపై అవగాహన కల్పిస్తున్నట్టు సదురు యువతి తెలిపింది. వైద్య నిపుణులు మాత్రం ఆమె చర్మం అలా కావడానికి వేరే కారణం ఉండి ఉండొచ్చని..
ఎండలో వెళితే అందరికీ ఇలా జరగదని.. క్యాన్సర్ ఉన్నవారు.. ఇలాంటి తరహా సమస్యలు ఎదుర్కొంటారని వైద్యులు చెబుతున్నారు.దీంతో యువతికి క్యాన్సర్ ఉండి ఉండొచ్చని.. అందుకే ఇలా జరిగిందని కొంత మంది నిపుణులు చెబుతున్నారు.