Begin typing your search above and press return to search.
రాజధానిలో మరోమారు రైతుల ఉద్యమం ఉద్రిక్తం!
By: Tupaki Desk | 22 Aug 2022 11:30 AM GMTమరోమారు దేశ రాజధాని ఢిల్లీ రైతుల ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గతంలో రైతుల ఉద్యమం నిర్వహించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. వాటిని తీర్చాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్యమ బాట పట్టారు.
యునైటెడ్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఆగస్టు 22 సోమవారం ఉదయం 10 గంటల నుంచి జంతర్ మంతర్ వద్ద రైతుల మహాపంచాయత్ ప్రారంభమైంది. దీనిలో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు.
మరోవైపు రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. 48వ నెంబరు జాతీయ రహదారితోపాటు పలు రహదారులపై నిఘా కొనసాగిస్తున్నారు. హరియాణా, రాజస్థాన్‌ల నుంచి వచ్చే వాహనాలపై సోదాలు చేస్తున్నారు. ఘాజీపూర్ సరిహద్దులో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేశారు.
అయితే ఆందోళన చేస్తున్న రైతులు ఒకరోజు ముందుగానే అంటే ఆదివారం నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో పోలీసులు సింగు, ఘాజీపూర్ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సరిహద్దుల గుండా వచ్చే వాహనాలపై సోదాలు చేస్తున్నారు. అయితే రైతుల ఉద్యమం నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
మరోవైపు జంతర్ మంతర్ ముందు పోలీసులు బారికేడ్లు వేసినప్పటికీ రైతులు దానిని బద్దలు కొట్టారు. జంతర్ మంతర్ లోపల జెండాలు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి వస్తున్న నిరసన తెలిపేందుకు వస్తున్న రైతులను ఘాజీపూర్ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అయితే సింగు సరిహద్దు గుండా వచ్చిన రైతులను మాత్రం అడ్డుకోలేకపోయారని వార్తలు వస్తున్నాయి.
రైతు నాయకుడు శివకుమార్ కక్కా మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు తమ డిమాండ్లలో ఏ ఒక్కదాన్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ గతంలో రైతులు ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లఖింపూర్ ఖేరీలో రైతుల మీదకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు కారు పోనిచ్చి రైతుల మరణాలకు కారణమైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను కూడా తొలగించలేదని రైతులు అప్పటి నుంచి మండిపడుతున్నారు. రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరించాలని కోరుతూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరెంటు బిల్లుల మాఫీ సహా వివిధ డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అఫిడవిట్ కూడా సమర్పిస్తామని రైతులు చెబుతున్నారు.