Begin typing your search above and press return to search.
కూతురు తల నరికి, చేతిలో పట్టుకుని వీధుల్లోకి తండ్రి.. ఆ తర్వాత !
By: Tupaki Desk | 4 March 2021 11:30 AM GMTతాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు , పక్క గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో మునిగిపోతే , ఆ విషయం తెలుసుకొని ఆమెని హెచ్చరిస్తే ఏ మాత్రం లెక్కచేయలేదు అని , ఇంకా బరి తెగించి తిరుగుతూ తన పరువు తీస్తుంది అనే కోపంతో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఆ యువతి తల నరికేశాడు. ఆనక ఆమె మొండాన్ని ఇంట్లోనే వదిలేసి తలను రోడ్డుపై పట్టుకుని ఊరేగాడు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే .. యూపీలోని హర్దోయ్ జిల్లాకు చెందిన సర్వేశ్ కు భార్య, ఇంటర్మీడియట్ చదివే కూతురు ఉంది. సర్వేశ్ కూతురు కొద్దికాలంగా ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని కబుర్లు చెప్పించుకునేది. ఆ వ్యవహారం ఊర్లో వాళ్లకి తెలిసి , ఆ నోటా ఈ నోటా పడి ఆమె తండ్రికి కూడా తెలిసింది. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసిన సర్వేశ్ ముందు ఆమెను మందలించాడు. కానీ ఆ యువతి తండ్రి మాటను లైట్ తీసుకుంది. కూతురు తన మాటను వినడం లేదనే ఆగ్రహంతో రగిలిపోయిన సర్వేశ్, ఆమెను హతమార్చాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా బుధవారం ఉదయం ఆమె తలను నరికేశాడు సర్వేశ్. అనంతరం మొండాన్ని ఇంట్లోనే ఉంచి, తలను పట్టుకుని రోడ్డు మీదకు వచ్చాడు.
దానిని చేతపట్టి కొంతదూరం దాకా నడుచుకుంటూ వెళ్లాడు. ఈ భయానక దృశ్యం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సర్వేశ్ దగ్గరికి చేరుకున్న పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మాట వినకపోవడంతోనే తన కూతురును కత్తితో తల నరికినట్టు ఒప్పుకున్నాడు. మీకు రుజువులు కావాలంటే తన ఇంటికెళ్లి బాడీని తీసుకొచ్చుకోండని పోలీసులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడిలో పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు. సర్వేశ్ను అరెస్టు చేసి, విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. అక్రమ సంబంధం కారణంగా కన్నతండ్రి చేతిలో యువతి దారుణ హత్యకు గురి కావడంతో ఉత్తరప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.