Begin typing your search above and press return to search.
'నీ కథను సినిమా తీస్తున్నాం.. రాత్రిళ్లు డిస్కషన్ పెట్టుకుందాం'
By: Tupaki Desk | 20 May 2022 4:28 AM GMTసినిమా కథా రచయితను నిర్మాత ఒకరు వేధింపులకు గురి చేసిన ఉదంతంలో గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కథ బాగుందంటూ కత మొదలు పెట్టిన అతను.. కథను మరింత బాగా మెరుగుపర్చేందుకు ఫైవ్ స్టార్ హోటల్లో రాత్రిళ్లు చర్చిద్దామంటూ పెడుతున్న వేధింపులపై మహిళా కథా రచయత షి పోలీసులను ఆశ్రయించింది. వారు గొల్కొండ పోలీసులకు కేసును బదిలీ చేయగా.. సదరు నిర్మాతను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ కు చెందిన మహిళా కథా రచయిత తన వద్ద ఉన్న ఒక కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్నెల్ల క్రితం ఆమెకు ఆన్ లైన్ లో ఒక నిర్మాత పరిచయమయ్యాడు. భిన్నమైన కథల్ని సినిమాగా తీస్తానని.. అందుకోసం ఎంత ఖర్చు అయినా ఫర్లేదంటూ కోతలు కోసేవాడు.
కథతో పాటు.. సన్నివేశాలకు సంబంధించిన రఫ్ కాపీని నిర్మాతకు అందజేశారు. కథను చదువుతానని చెబుతూ.. ఆమెకు వీలున్నప్పుడల్లా ఫోన్ చేసి మాట్లాడదామనేవాడు.
కొద్ది రోజుల క్రితం అతడే ఆమెకు ఫోన్ చేసి కథ బాగుందని.. రాత్రిళ్లు కలిస్తే మరింత బాగుంటుందంటూ తన దుర్మార్గపు కోరికను బయపెట్టాడు.
అప్పటి నుంచి రాత్రిళ్లు ఫోన్ చేయటం.. ఫైవ్ స్టార్ హోటల్ లో అయితే వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని చెబుతూ తెగ వేధింపులకుగురి చేసేవాడు. తన కోరికను తీర్చకుంటే ఒక్క సినిమాకు అవకాశం రాకుండా అడ్డుకుంటానని బెదిరించేవాడు.
అతడి బెదిరింపులకు బెదిరిన సదరు మహిళ రచయిత షీ టీంను సంప్రదించారు. ఆమె ఉదంతం గురించి తెలిసిన డీసీపీ శిరీష రాఘవేంద్ర స్వయంగా బాధితురాలితో మాట్లాడి గొల్కొండ పోలీసులకు కంప్లైంట్ ఇప్పించారు. ఆమె ఇచ్చిన ఆధారాలతో సదరు నిర్మాతను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటోళ్లకు ఇదే తగినశాస్తి.