Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలి ఏసీ బస్​ టెర్మినల్​.. ఎల్​ బీనగర్ ​లో..

By:  Tupaki Desk   |   29 Dec 2020 10:07 AM GMT
దేశంలోనే తొలి ఏసీ బస్​ టెర్మినల్​.. ఎల్​ బీనగర్ ​లో..
X
హైదరాబాద్​ లోని ఎల్ బీనగర్​లో అధునాతన ఏసీ బస్​ టెర్మినల్​లో నిర్మించబోతున్నారు. దాదాపు రూ. 9 కోట్ల బడ్జెట్​తో తొలిదశ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే హెచ్ఎండీఏ టెండర్లకు ఆహ్వానించింది. మొదటిదశలో 10 బస్​బేలను నిర్మించనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ బస్​బేలో సౌకర్యాలు పెట్టబోతున్నారు. ఈ టెర్మినల్​కు మలిదశ తెలంగాణ పోరాట అమరుడు శ్రీకాంత్​చారి పేరు పెట్టబోతున్నారు. 680 మీటర్ల మేర ఈ బస్​బే విస్తరించబోతున్నదట. ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్​ బస్సులతో ఎల్​బీనగర్​ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ బస్సులతో ఇక్కడ నిత్యం ట్రాఫిక్​ జామ్​ అవుతోంది.

దీంతో ఎల్​బీనగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి ఈ బస్​బేల నిర్మాణానికి రూపకల్పన చేశారు. 500 - 600 వరకు బస్సులు ఆగేలా ఆ బస్​టెర్మినల్​ను ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాక ప్రయాణికులకు అన్నిరకాల వసతులను కల్పించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించనున్నారు. బస్‌బేలకు రూ.4.50 కోట్లు, సోలార్‌ ప్లాంట్ కు రూ.4.5 కోట్లు వెచ్చించనున్నారు. ట్రాఫిక్​ సమస్యకు చెక్​ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

ఈ టెర్మినల్​లో ప్రయాణికుల కోసం ఏసీ, నాన్​ ఏసీ గదులను ఏర్పాటుచేశారు. అంతేకాక వైఫై, నీటి శుద్ధకేంద్రం, ఇతర వాహానాల పార్కింగ్​, ఫుడుకోర్టులు, ఏటీఎం సెంటర్లు, బుక్​షాప్​, యోగా సెంటర్​, ఆధునాతన స్నానాలగదులు, టాయిలెట్స్​, ఇక్కడ ఏర్పాటుచేయబోతున్నారు. ఈ ఏడాది జనవరిలో పనులను ప్రారంభించనున్నారు. మే మొదటి దీని పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఎల్​బీనగర్​లో బస్సు టెర్మినల్​ను ఏర్పాటు చేయడం తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ అని ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి పేర్కొన్నారు.