Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే మొదటి బీచ్ భారత్ లోనే.. ఎక్కడంటే..?
By: Tupaki Desk | 19 Nov 2021 1:30 AM GMTబీచ్.. కేరింతలు కొట్టడానికి కేరాఫ్ అడ్రస్. సాగర తీరాన ఆటలాడుకోవడానికి ఎవరైనా ఎగిరి గంతేస్తారు. పిల్లాపెద్దలు తేకుండా సముద్రతీరాన కాలక్షేపం చేయాలనుకుంటారు. చల్లని, మెత్తని ఇసుక... అలలపై నుంచి వచ్చే ఆ చిరు గాలులు నిజంగా ఎంత ప్రశాంతతను కలగజేస్తాయి. సూర్యోదయం, సంధ్యాసమయాన ఆ ప్రాంతంలో ఉండే అందం వర్ణనాతీతం. ఇటువంటి బీచ్ లు మన దేశంలోనూ చాలా ఉన్నాయి.
అయితే ఈ బీచ్ లపై శాస్త్రవేత్తల బృందం పలు పరిశోధనలు నిర్వహించింది. ప్రపంచంలోనే తొలి బీచ్ ఎక్కడ ఉంది? ఎలా ఏర్పడింది? అనే కోణంలో పరిశోధనలు చేశారు. శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలోనే మొదటి బీచ్ భారత్ లోనే ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఝార్ఘండ్ లోని సింఘ్ భూమ్ లో ఏర్పడినట్లు నిపుణులు గుర్తించారు. అక్కడ ఉన్న వస్తువులపై పలు పరిశోధనలు నిర్వహించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి.
సింఘ్ భూమ్ సముద్ర తీరంలోని రాళ్లు, ఇసుక, కొన్ని శిలాజాలపై భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసింది. అయితే ఇక్కడ ఉన్న తీర ప్రాంతం 330 కోట్ల సంవత్సరాల కింద ఉద్భవించిందని శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేల్చారు. కొన్ని కోట్ల ఏళ్ల నుంచి ఈ స్థిరమైన ఖండాతర భూభాగాలు ఏర్పడినట్లు గుర్తించారు.
బిలియన్ సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం నుంచి వెలుపలికి వచ్చిన పదార్థాలు చల్లబడి భూమి ఏర్పడిందని అన్నారు. పరిణామ క్రమంలో కొన్ని మార్పులు చెందుతూ వేల సంవత్సరాల క్రితం నుంచి నివాసయోగ్యంగా మారిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా అగ్నిశిలల నుంచి వచ్చిన కొన్ని ప్రత్యేక వాయువులు సముద్రంలో కలిసి... ఆ క్రమంలో ఆక్సిజన్ ఏర్పడిందని నిపుణులు గుర్తించారు. ఈ ప్రక్రియ జరగడానికి దాదాపు 250 కోట్ల ఏళ్ల సమయం పట్టిందని వారు వివరించారు.
అక్కడ ఉన్న నదీమార్గాలు, శిలలు వంటి వాటిపై జరిపిన పరిశోధనల్లో సముద్ర తీర ప్రాంతం ఏర్పడినట్లు గుర్తించామని చెప్పారు. కానీ అది ఎంత పరిమాణంలో ఉందని గుర్తించలేదని వారు పేర్కొన్నారు. కానీ సముద్రతీరంలోని అవక్షేప శిలలు, యురేనియం, లెడ్ కంటెంట్ ను బట్టి ఆ 330 కోట్ల ఏళ్ల కింద ఏర్పడిందని వారు గుర్తించారు.
ఈ సృష్టిలో ఇప్పటికే ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిలో చాలావరకు మనదేశంలోనే ఉన్నాయి. భారత్ లో ఉన్న అనేక వింతల్లో ఈ బీచ్ కూడా ఒకటి. క్రేజీ థింగ్ అయిన బీచ్... ప్రపంచంలోనే తొలి సముద్రతీర ప్రాంతం మనదేశంలోని ఉండడం నిజంగా విశేషమే.