Begin typing your search above and press return to search.
జగన్ పాలనలో చంద్రబాబు పై తొలి కేసు.. నమోదు చేసిన పోలీసులు
By: Tupaki Desk | 19 April 2022 3:43 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై తాజాగా కేసులు నమోదయ్యాయి. మాజీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదుకావడం ఇదే తొలిసారి. గత మూడేళ్లుగా ఆయనపై కేసులు పెట్టాలనే ప్రయత్నాలు జరిగినా.. ఎక్కడా చంద్రబాబు మాత్రం దొరకలేదు. కానీ.. తాజాగా ఆయనపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పోలీసుస్టేషన్లో చంద్రబాబు, నారా లోకేశ్పై కేసు నమోదైంది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే.. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు.. ఎందుకు చేశారు? ఎప్పుడు చేశారు? అనే విషయాలను మాత్రం పోలీసులు వెల్లడించలే దు. అయితే, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషశ్రీ చరణ్ స్వాగత సంబరాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని.. దాని కారణంగా ఓ చిన్నారి మృతి చెందిందని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఆ విషయాన్ని చంద్రబాబు, నారా లోకేశ్ ట్విట్టర్లో ప్రస్తావించా రు. ఈ పోస్టులు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని భాస్కర్(ఇది పోలీసులు చెబుతున్న నకిలీ పేరు అని టీడీపీ నేతలు చెబుతున్నారు) చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 153-A, R/W 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల కేసు నమోదుపై నారా లోకేష్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ప్రశ్నిస్తే కేసులు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. తమపై నమోదైన కేసుపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలతో జగన్‌పైనా.. పోలీసులపైనా విరుచుకుపడ్డారు.
"ఇంత పిరికివాడివేంటి జగన్ రెడ్డి? ప్రశ్నిస్తే కేసు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటా. హత్యాయత్నంతో పాటు 11 కేసులు పెట్టావు. ఇప్పుడు కళ్యాణదుర్గంలో మరో కేసు పెట్టావు. నీలా ప్రజల సొమ్ము దొబ్బినందుకు నాపై కేసులు లేవు. ప్రజల పక్షాన నిలబడినందుకు మాత్రమే నాపై కేసులు ఉన్నాయి.
మంత్రి పర్యటన సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసి దళిత చిన్నారిని బలిగొన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని అడిగిన నాపై కేసు పెట్టారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావు. నెక్స్ట్ ఏంటి? రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా..? దేనికైనా రెడీ" అని ట్విటర్ వేదికగా సవాల్ చేశారు లోకేష్. దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.