Begin typing your search above and press return to search.
మహిళలకు 51శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం
By: Tupaki Desk | 8 March 2022 9:45 AM GMTఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా సాధికారతకు అర్థం చెప్పేలా మహిళలు ఇక్కడికి వచ్చారన్నారు. ఆధునిక ఏపీలో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులేనన్నారు. ఈ సందర్భండా ఐన్ రైన్డ్ అనే మహిళ సూక్తులు వల్లెవేశారు.
ఇక్కడున్న వారిలో 99శాతం మంది మహిళలు ఏదో ఒక పదవిలో ఉన్నారని.. భారత దేశ మహిళా సాధికారత చరిత్రలోనే ఇంతమంది మమిళా ప్రజాప్రతినిధుల సమావేశం ఎక్కడా ఎప్పుడూ చూడలేదన్నారు. 1993 నుంచి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కు పార్లమెంట్ లో బిల్లులు పెడుతూనే ఉన్నారని.. మహిళలకు 51 శాతం పదువులు ఇచ్చిన తొలి ప్రభుత్వం వైసీపీ అని.. 1356 పదవుల్లో 51 శాతం మహిళలకే ఇచ్చామన్నారు.
మహిళల కోసం చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనదేనని.. మహిళలకు 51శాతం పదవులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని జగన్ స్పష్టం చేశారు. రెండున్నరేళ్లుగా అధికారాన్ని మహిళల కోసం వినియోగించామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా రెడ్డి పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. వాలంటీర్లుగా 53శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.13వేల కోట్లు ఇచ్చామని తెలిపారు.
శాసనమండలి తొలి వైస్ చైర్మన్ గా జాఖియా ఖానమ్ ను నియమించామని.. రాష్ట్ర తొలి మమిళా డిప్యూటీ సీఎం, హోంమంత్రి, సీఎస్, ఎలక్షన్ అధికారిగా పదవులు ఇచ్చిన ఘనత వైసీపీప్రభుత్వానిదేనని సీఎం జగన్ పేర్కొన్నారు.
దేశంలో ఏపీతో సమానంగా ఏ ప్రభుత్వం మహిళలకు బలపరచలేదన్నారు. ఇప్పటివరకూ 44.5 లక్షల మంది మహిళలకు రూ.13022 కోట్లు అమ్మఒడి ద్వారా ఇచ్చామని సీఎం తెలిపారు.