Begin typing your search above and press return to search.
ఆ అందాల పోటీకి ‘‘చిట్టి’’నే జడ్జ్
By: Tupaki Desk | 4 Jan 2016 10:49 AM GMTరోజురోజుకి పెరుగుతున్న సాంకేతికత పుణ్యమా అని చిత్రవిచిత్రమైన ఆవిష్కరణలు వచ్చేస్తున్నాయి. మనిషి..స్థానంలో యంత్రాన్ని వినియోగించటం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ వాడకం ఎంతవరకూ వచ్చిందంటే.. ఆపీసులు మొదలుకొని.. బెడ్ రూమ్ వరకూ వచ్చేశాయి. మనిషి.. యంత్రుడు (రోబో)కి మధ్య దూరం రోజురోజుకీ తగ్గిపోతున్న పరిస్థితి.
ఈ మధ్యన తయారు చేస్తున్న సరికొత్త రోబోలతో.. రెసెప్షనిస్ట్ ల దగ్గర నుంచి.. అన్ని చోట్లా హ్యుమనాయిడ్ రోబోల వినియోగం పెరుగుతోంది. తాజాగా మరో కీలకమైన కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా ఒక రోబో వ్యవహరించనుంది. బ్యూటీ.ఏఐ అనే వెబ్ సైట్ అంతర్జాతీయ అందాల పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనే వారిలో విజేతను ఎంపిక చేసే బాధ్యతను ఒక రోబోకు అప్పగించనున్నారు.
కొన్నేళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రోబో అన్న సినిమా వచ్చింది. అందులో హీరో.. చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. అది చేసే విన్యాసాలు అప్పట్లో సినీప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవటమే కాదు.. ఆ సినిమాలో మాదిరి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా? అన్న చర్చ కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో అందుబాటులోకి వచ్చిన రోబోల్ని చూస్తే.. ‘‘చిట్టి’’ స్థాయిలో కాకున్నా.. కాస్త దగ్గరగా వస్తున్న పరిస్థితి.
తాజా పోటీ విషయానికి వస్తే.. ఈ అందాల పోటీలో పాల్గొనే యువతీయువకులు.. తమ సెల్ఫీలను తీసుకొని బ్యూటీ.ఏఐ మొబైల్ యాప్ కు పంపాలి. ఈ పోటీలో పాల్గొనే వారు మేకప్ వేసుకోకూడదు. కళ్లజోడు.. టోపీలు లాంటివి.. పెట్టుకోకూడదు. ఇలా పంపిన ఫోటోల్ని రోబో జ్యూరీ పరిశీలిస్తుంది. తమకున్న సాంకేతిక సాయంతో.. ముఖాలపై మడతలు మొదలుకొని.. వారి చర్మసౌందర్యాన్ని.. ముఖ సౌందర్యాన్ని అంచనా వేస్తుంది. ఆపై విజేతను డిసైడ్ చేయనుంది. ఈ పోటీ విజేత వివరాలు ఈ జనవరి 28న ప్రకటించనున్నారు. మరి.. ‘‘చిట్టి’’లాంటి రోబో ప్యానల్ డిసైడ్ చేసే అందాలు ఎలా ఉంటాయో..?