Begin typing your search above and press return to search.
నాలుగు నెలల చీకటి తర్వాత తొలి సూర్యోదయం.. వైరల్
By: Tupaki Desk | 23 Aug 2022 2:30 PM GMTఅంటర్కాటికా.. అదో చీకటి ఖండం.. నాలుగు నెలల పాటు సూర్యూడే కనిపించని ఖండం.. అక్కడ జీవరాశి మనుగడకు ఆధారమైన సూర్యుడు లేక నాలుగు నెలల పాటు అంధకారం అలుముకుంటుంది. భూమికి దక్షిణ అడుగును ఈ ప్రాంతం ఉత్తరాధ్ర గోళంలో సూర్యుడు వస్తే చీకటి మయం అవుతుంది. నాలుగు నెలల పాటు వెలుగు అన్నదే ఉండదక్కడ.. కఠిన శీతాకాలం.. ఏకంగా ఉష్నోగ్రతలు మైనస్ 70-80లకు పడిపోతాయి.. మనిషి బయటకు వస్తే గడ్డకట్టుకుపోతాడు. అలాంటి చోట బతకడం చాలా కష్టం.
మైనస్ ఉష్నోగ్రతలు నమోదయ్యే అంటార్కిటికా ఖండంలో శీతాకాలం ముగిసింది. నాలుగు నెలల సుధీర్ఘ చీకటి తర్వాత తాజాగా అక్కడి మంచు కొండల మధ్యలో నుంచి సూర్యుడు తొంగి చూశాడు. అంటార్కిటికాలో సూర్యుడి రాకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వెల్లడించింది. తాము సూర్యోదయాన్ని చూసినట్లు కాంకోర్డియా స్టేషన్ లోని 12 మంది సభ్యుల బృందం పేర్కొంది.
శీతాకాలం ముగియడంతో ఆగస్టులో మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు. నాలుగు నెలల తర్వాత అంటార్కిటికాలో తొలి సూర్యోదయానికి సంబంధించి వైద్యుడు హన్నెస్ హాగ్సన్ తీసిన ఫొటోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన కాలాలు ఉంటాయి. అంటార్కిటికాలో మాత్రం కేవలం రెండే ఉంటాయి. అవి వేసవి, శీతాకాలాలు. సాధారణంగా దక్షిణ దృవానికి దగ్గరగా ఉండే అంటార్కిటికాలో మే నెలలో శీతాకాలం మొదలుకాగానే ఉష్ణోగ్రతలు మైనస్ 70-80 డిగ్రీలకు పడిపోతాయి. ఇక సూర్యోదయం కనిపించదు. ఆగస్టు వరకూ నాలుగు నెలల పాటు అక్కడ రాత్రి పగలు చిమ్మి చీకటి నెలకొంటుంది.
పరిశోధకులు ఈ కాలాన్ని 'బంగారు గని'గా అభివర్ణిస్తారు. సైంటిస్టులు బయోమెడికల్ పరిశోధనలతోపాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తారు. మూత్రం, మలం, రక్తం నమూనాల నుంచి డేటాను సేకరించడం.. మానవశరీరంపై సాధారణ , విపరీత వాతావరణాల ప్రభావాలను అధ్యయనం చేస్తారు.
ఈ నాలుగు నెలలు పరిశోధనలకు సువర్ణకాలంగా పేర్కొంటారు. సూర్యుడి లేని చోట వ్యోమగాములకు సహాయపడే కొత్త అంశాలను ఇక్కడ కనుగొంటారు.