Begin typing your search above and press return to search.

మొదటి పరీక్షే పెద్ద సవాలు

By:  Tupaki Desk   |   3 Oct 2022 5:09 AM GMT
మొదటి పరీక్షే పెద్ద సవాలు
X
ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ మూడు రోజుల్లోనే జాతీయ పార్టీగా మారబోతోంది. టీఆర్ఎస్ జాతీయపార్టీగా మారిన తర్వాతే కేసీయార్ కు అతిపెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక రూపంలోనే ఆ పరీక్ష ఎదురవుతోంది. ఆ పరీక్షలో పాస్సవటం కేసీయార్ కు పెద్ద సవాలనే చెప్పాలి. జాతీయ పార్టీగా మారిన తర్వాత జరిగిన మొదటి ఉపఎన్నికలో పార్టీ గనుక గెలవకపోతే దేశమంతా నెగిటివ్ సిగ్నల్స్ వెళిపోతాయి.

కాబట్టి మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ గెలిచి తీరాల్సిన పరిస్ధితి. అయితే పార్టీ గెలుపు ఖాయమని కేసీయార్ తాజాగా చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్ధితులను చూస్తే అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ తరపున అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీచేయించాలని కేసీయార్ ఆలోచన. అయితే కూసుకుంట్లకు నియోజకవర్గంలో విపరీతమైన వ్యతిరేకతుంది. నేతలే కూసుకుంట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తమ ఇష్టానికి వ్యతిరేకంగా అభ్యర్ధిని ఫీల్డ్ చేస్తే తాము ఎట్టి పరిస్ధితుల్లోను పనిచేయమని నేతలంతా కేసీయార్ కే డైరెక్టుగా చెప్పేశారు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచకే కేసీయార్ ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. ఒకవైపు కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అభ్యర్ధులుగా ప్రచారం చేసుకుంటుంటే మంత్రి జగదీశ్వరరెడ్డి అండ్ కో మాత్రం టీఆర్ఎస్ ను గెలిపించమని మాత్రమే కోరుతున్నారు.

మరీ పరిస్ధితులో మెజారిటీ నేతల అభిప్రాయం ప్రకారమే అభ్యర్ధిని ప్రకటిస్తారా ? లేకపోతే తనిష్టం వచ్చినట్లు కూసుకుంట్లనే ప్రకటిస్తారా అన్నది సస్పెన్సుగా మారింది. ఒకవేళ కూసుకుంట్లనే అభ్యర్ధిగా ప్రకటించి లోకల్ నేతలు ఎవరు పనిచేయకపోతే అప్పుడు అధికార పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారు ?

దాని ప్రభావం కచ్చితంగా కేసీయార్ పైన పడుతుంది. ఈ విషయాలను ఆలోచించలేనంత అమాయకుడు కాదు కేసీయార్. అయినా ఎందుకనో కూసుకుంట్ల విషయంలో కేసీయార్ మహా పట్టుదలగా ఉన్నారు. కాబట్టి మునుగోడు ఉపఎన్నికే పార్టీకి, కేసీయార్ కు పెద్ద పరీక్ష కాబోతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.