Begin typing your search above and press return to search.

14 మంది ఫుడ్ బిల్ రూ.1.3 కోట్లు.. నెట్టింట్లో పేలుతున్న సెటైర్లు..!

By:  Tupaki Desk   |   22 Nov 2022 5:30 AM GMT
14 మంది ఫుడ్ బిల్ రూ.1.3 కోట్లు.. నెట్టింట్లో పేలుతున్న సెటైర్లు..!
X
మనిషి తన జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్రెండ్స్.. ఫ్యామిలీకి కొంత సమయం కేటాయించాల్సిందే. లేకుంటే ఏదో ఒకటి కోల్పోయినట్లు అన్పిస్తుంది. ఉద్యోగుల చేసేవారైతే వీకెండ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. వ్యాపారులు సైతం తమ పనిలో కొంత గ్యాప్ తీసుకొని విహార యాత్రల పేరుతో సరదా గడిపేందుకు అప్పుడప్పుడు ప్రయత్నిస్తుంటారు.

ఇక స్నేహితులైతే వీలు చిక్కినప్పుడల్లా కలుసుకుని ఎంజాయ్ చేసేందుకే మొగ్గు చూపుతుంటారు. అలా కొందరు స్నేహితులు.. బంధువులు కలిసి ఓ వ్యక్తి ఇచ్చిన పార్టీకి వెళ్లారు.

ఓ ప్రముఖ రెస్టారెంట్ లో మంచి ఫుడ్.. వైన్ ఆర్డర్ చేసి లాగించారు. ఇక తీరా బిల్లు చూస్తే మాత్రం అక్షరాల 1.3కోట్లు బిల్లు వచ్చింది. ఈ బిల్లును ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అబుదాబీలో సాల్డ్ బేగా ప్రముఖ చెఫ్ సుస్రత్ గోక్స్ పాపులర్ అయ్యారు. ఈ రెస్టారెంట్ లో పుడ్ ఎంత బాగుంటుందో తెలియదు గానీ బిల్లు చూస్తే మాత్రం ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందేననే మాట తరుచూ విన్పిస్తూ ఉంటుంది. తాజాగా సుస్రత్ గోక్స్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి 14 మందికి ఫార్టీ ఇచ్చారు. వీరంతా ఆహారంతోపాటు వైన్ ఆర్డర్ చేశారు.

వీటిలో అత్యంత పాపులర్ అయిన బోర్డియాక్స్.. బక్లావా వైన్.. 24 క్యారెట్ల గోల్డ్ కోటింగ్ చేసిన స్టీక్ ఫుడ్(మాంసం)తోపాటు ఇతర వంటకాలున్నాయి. వీటన్నింటికి కలిపి బిల్లు 6 లక్షల 15 వేల 65 దిర్హామ్ లు అయింది. ఇది మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ఈ బిల్లు అక్షరాలు ఒక కోటి మూడు లక్షలు. ఈ బిల్లును సుస్రత్ గోక్స్ తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ 'నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

దీనిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో సుస్రత్ గోక్స్ పై సెటైర్లు వేస్తున్నారు. నీ రెస్టారెంట్లోని వంటకాలు ఏమైనా అంతరిక్షం నుంచి తెచ్చావా? ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే మంసానికి.. వైన్ కు ఇంత ధరనా?.. నీ రెస్టారెంట్ ధనవంతుల కోసమేనా? సామాన్యుల కోసం కాదా? అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద తెలియజేయండి..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.