Begin typing your search above and press return to search.

ఫామ్ హౌస్ కు వెళ్లటానికి ముందు ప్రగతి భవన్ లో ఆ నలుగురు

By:  Tupaki Desk   |   27 Oct 2022 4:19 AM GMT
ఫామ్ హౌస్ కు వెళ్లటానికి ముందు ప్రగతి భవన్ లో ఆ నలుగురు
X
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీకి చెందిన మధ్యవర్తులు ముగ్గురు ప్రయత్నించటం.. అందుకు ప్రతిగా ఆఫర్ ఇచ్చినోళ్లను అడ్డంగా బుక్ చేసిన వైనం రాజకీయ సంచలనంగా మారటం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఉదంతంలో పెద్దగా హైలెట్ కాని వ్యవహారం ఒకటి ఉంది.

అదేమంటే.. ఫామ్ హౌస్ ఎపిసోడ్ కు ముందు ప్రగతిభవన్ లో భారీ ఎత్తున కసరత్తు జరిగినట్లుగా చెబుతున్నారు. తమను పార్టీ మారేందుకు భారీ ఆఫర్ ఇచ్చారన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేరుగా చెప్పేసిన నలుగురు ఎమ్మెల్యేల మాటలతో.. ఈ ఇష్యూ లెక్క తేల్చేందుకు సీఎమ్మే స్వయంగా రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా నాలుగు రోజుల నుంచి పక్కా ప్లానింగ్ తో పాటు.. ఫామ్ హౌస్ ఎపిసోడ్ కు ముందు.. ప్రగతిభవన్ లోనూ గంటల కొద్దీ కసరత్తు జరిగినట్లుగా చెబుతున్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లటానికి ముందుగా నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఉదయమే ప్రగతిభవన్ కు వెళ్లినట్లుగా చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపుల ప్రలోభానికి గురి చేసే వారి వివరాల్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి.. రివర్సు గేర్ లో వారినే బుక్ చేయటం ఎలా అన్న దానిపై క్షుణ్ణంగా చర్చించినట్లుగా చెబుతున్నారు.

తమ ప్లాన్ ను పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్న వేళలో.. మరోసారి మొత్తం విషయాల్ని తెలుసుకునేందుకు.. అందుకు తగ్గ ఆధారాలు ఏమేం ఉన్నాయన్న దానిపై చర్చించేందుకు బుధవారం ఉదయం 10 గంటలకు నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ కు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. వీరితో మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని.. ఆయన చేసిన సూచనల్ని పక్కాగా అమలు చేసేందుకు సిద్దమైన వారు.. ఫామ్ హౌస్ కు బయలుదేరినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా వ్యక్తిగత సిబ్బంది..

సెక్యురిటీలను వదిలేసిన ఎమ్మెల్యేలు తామే వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ ఫామ్ హౌస్ కు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత అనుకున్న విధంగా.. తమను ఎర వేసేందుకు ప్రయత్నించిన వారిని అడ్డంగా బుక్ చేసిన ఎపిసోడ్ కు తెర తీసినట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.