Begin typing your search above and press return to search.

అమెరికాలో ఆ ఇంట్లో దెయ్యం ..ఏంచేస్తుందంటే?

By:  Tupaki Desk   |   17 March 2021 2:30 PM GMT
అమెరికాలో ఆ ఇంట్లో దెయ్యం ..ఏంచేస్తుందంటే?
X
సాధరణంగా దెయ్యం ఉంది అని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మరు. అది వారి వారి మైండ్ సెట్ ను బట్టి ఉంటుంది. అయితే , దెయ్యం ఉంది అని చెప్పడానికి సరైన అధరాలు లేవు , అలాగే దెయ్యం లేదు అని చెప్పడానికి కూడా అధరాలు లేవు. అందుకే ఎవరి నమ్మకం వారిది. ఇదిలా ఉంటే ... తాజాగా అమెరికాలోని లాస్‌ వేగస్ ‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఓ బామ్మ ,ఈ బామ్మకు ఒక కొడుకు. అతడికి ఇద్దరు పిల్లలు. వారందరూ కలిసి హాయిగా జీవించేవారు. అయితే బామ్మ మనవడు, మనవరాలు తమ గదిలో అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రలోనే ఎవరితోనో మాట్లాడుతున్నారట. మొదట కల కావచ్చు అనుకున్నారట.

కానీ పదే పదే పిల్లలు నిద్రలో మాట్లాడుతుండడంతో ఆ గదిలో మోషన్‌ యాక్టివేటెడ్‌ కెమెరాను ఫిక్స్ చేశారు. రెండు మూడురోజుల తరువాత ఈ కెమెరాను పరిశీలించగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక మనిషి వంతు ఓ ఆకారం కనిపించింది. పిల్లలు ఎవరో ఫ్రెండ్‌ తో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నారట గానీ భయపడడం లేదట. ఒకరోజు అయితే ఈ ఆకారం బయటికి వెళ్లండి అని పిల్లలను గట్టిగా గద్దించిందట. బామ్మ ఈ అనుభవాన్ని ఫొటోతో సహా ఫేస్‌ బుక్‌ లో షేర్‌ చేసింది. సలహా ఇవ్వమని అడిగింది. ‘మూఢనమ్మకాలను వదలండీ’ ‘మీరేదో భ్రమల్లో ఉన్నారు’ ‘ఫేక్‌ ఇమేజ్‌’ లాంటి తిట్లతో పాటు– ‘ఇల్లు అమ్మేసి వేరే ఇంట్లోకి మారండి. 20 సంవత్సరాల ఇంట్లోకి దెయ్యాలు రావడం కొత్తేమీ కాదు’ లాంటి సలహాలు కూడా వచ్చాయి. ఒక ఆకారం ఏదో కనిపిస్తున్న ఫొటో గురించి ప్రస్తావన వస్తే ‘ఫేక్‌ ఫొటోలు సృష్టించే టెక్నికల్‌ నాలెడ్జ్‌ నాకు లేదని ఎవరిని అడిగినా చెబుతారు. పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన ఖర్మ నాకేమిటి!’ అంటోంది బామ్మ.