Begin typing your search above and press return to search.
గిన్నీస్ మ్యూజియంలో దాచుకోండని.. వెంట్రుకలు ఇచ్చిన అమ్మాయి..!
By: Tupaki Desk | 17 April 2021 1:30 AM GMTప్రపంచ అద్భుతాలకు నెలవు గిన్నీస్ బుక్. అనితర సాధ్యమైన రికార్డులన్నీ అందులో నమోదవుతుంటాయి. ఆ బుక్ లో చోటు దక్కించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కోరకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి కేటగిరికీ చెందిన అమ్మాయే నిలాంషి పటేల్. ఆమె తన జుట్టుతో రికార్డు సాధించాలని ప్రయత్నించింది. చివరకు సాధించింది.
దీంతో.. ప్రపంచంలో అతి పొడవైన జుట్టు గల మహిళగా నిలిచింది నిలాంషి పటేల్. గుజరాత్ రాష్ట్రంలోని అరవల్లి జిల్లాకు చెందిన ఈ 17 సంవత్సరాల యువతి.. తన జుట్టును ఏకంగా 6 అడుగుల 6.7 అంగులాల పొడవు పెంచింది. ఇంత పొడవైన జుట్టు పెంచడంతో గిన్నీస్ బుక్ రికార్డ్సులో స్థానం లభించింది.
అయితే.. 2018లోనే 170.5 సెంటీమీటర్లతో గిన్నీస్ రికార్డు సాధించిన నిలాంషి.. ఆ తర్వాత రెండు సార్లు తన రికార్డును తానే అధిగమించింది. 2019లో 190 సెంటీ మీటర్లు పెంచగా.. 2020లో తన జుట్టును 200 సెంటీ మీటర్ల పొడవు పెంచింది.
అయితే.. తాజాగా తన జుట్టును కత్తిరించుకుంది నిలాంషి. ఇందుకు సంబంధించిన చిత్రాలను తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్టు చేసింది. 'ఉత్సాహంగా ఉంది. అదే సమయంలో కాస్త భయంగా కూడా ఉంది. ఈ కొత్త హెయిర్ స్టైల్ లో ఎలా కనిపిస్తానో? కఆనీ.. అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాను' అంటూ రాసుకొచ్చింది. నిలాంషి. కత్తిరించిన ఈ వెంట్రుకలను గిన్నీస్ రికార్డ్స్ మ్యూజియానికి అందజేసిందట.