Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: ప్రియుడికి వేరే పెళ్లి.. గుండెలు బాదుకొని ఏడ్చిన‌ ప్రియురాలు!

By:  Tupaki Desk   |   12 July 2021 10:01 AM GMT
వైరల్ వీడియో:  ప్రియుడికి వేరే పెళ్లి.. గుండెలు బాదుకొని ఏడ్చిన‌ ప్రియురాలు!
X
ప్రేమించే మ‌న‌సు అంద‌రికీ ఉంటుంది.. కానీ ప్రేమించిన వారిని ద‌క్కించుకునే అదృష్టం మాత్రం కొంద‌రికే ఉంటుంది. ఎంతో మంది త‌మ ప్రేమను స‌ఫ‌లం చేసుకోలేక మ‌న‌సులోనే కుమిలిపోతుంటారు. ప్రేమ‌ను పెళ్లి మండ‌పం వ‌ర‌కు తీసుకెళ్ల‌లేక మ‌ధ్య‌లోనే వ‌దిలేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేస్తుంది. అయితే.. ప్రాణంగా ప్రేమించిన వారు.. మ‌రొక‌రిని పెళ్లి చేసుకుపోతుంటే.. కొంద‌రు మౌనంగా రోదిస్తే.. మ‌రికొంద‌రు త‌ట్టుకోలేరు. అలాంటి ఓ మ‌హిళ.. త‌న ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న విష‌యం తెలిసి ఆగ‌లేక‌పోయింది. ప్రియుడికి పెళ్లి జ‌రుగుతున్న‌ మండ‌పం వ‌ద్ద‌కు వెళ్లి గుండెల‌విసేలా రోదించింది.

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని హోసంగాబాద్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాన్పూర్ కు చెందిన ఓ యువ‌తి ఉద్యోగం కోసం భోపాల్ లో ఉంటోంది. తాను ప‌నిచేస్తున్న సంస్థ‌లోనే ఉద్యోగం చేస్తున్న ఓ వ్య‌క్తితో మూడేళ్లుగా ప్రేమ‌లో ఉంది. ఈ క్ర‌మంలో మూడేళ్లుగా వీరిద్ద‌రూ స‌హ‌జీవ‌నంలోనే ఉన్నారు. కానీ.. ఇటీవ‌ల అబ్బాయి వాళ్ల ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. దీంతో.. పెళ్లి కొడుకు సైతం సిద్ధ‌మైపోయాడు. హోసంగాబాద్ లో పెళ్లి జ‌రుగుతోంది.

ఈ విష‌యం తెలుసుకున్న ప్రియురాలు అక్క‌డికి వెళ్లి గుండెలు ప‌గిలేలా రోదించింది. బాబూ.. బాబూ.. అంటూ బ‌య‌ట ఉండి క‌న్నీళ్లు పెట్టుకుంది. బ‌య‌ట‌కు రావాల‌ని, త‌న‌తో మాట్లాడాల‌ని వేడుకుంది. పెళ్లివారు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో.. వారు అక్క‌డికి చేరుకున్నారు. తామిద్ద‌రం మూడేళ్లుగా స‌హ‌జీవ‌నంలో ఉన్నామ‌ని, ఇప్పుడు ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకుంటున్నాడ‌ని తెలిపింది. ఫిర్యాదు చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చెప్పిన‌ప్ప‌టికీ.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని ఫిర్యాదు చేయ‌లేద‌ని స‌మాచారం.

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ప్రేమించిన వాడిని వ‌దులుకోలేక ఆమె ప‌డుతున్న వేద‌న ఎంతో మందిని క‌దిలిస్తోంది. బాధితురాలికి మ‌ద్ద‌తుగా కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. ఇలాంటి మోస‌గాళ్ల‌ను ఊరికే వ‌దిలి పెట్టొద్ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు.