Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్.. ఇక అన్ని వైరస్ లకు ఒకటే వ్యాక్సిన్!

By:  Tupaki Desk   |   29 Aug 2020 3:45 AM GMT
గుడ్ న్యూస్.. ఇక అన్ని వైరస్ లకు ఒకటే వ్యాక్సిన్!
X
ప్రపంచంలోని జనాలు వరుస బెట్టి వస్తున్న వైరస్ లతో బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటి వరకూ సార్స్, మెర్స్ వంటి వైరస్ లతో వణికిపోయిన జనం ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడి విలవిల్లాడుతున్నారు. ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు చాలా దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రఖ్యాత కేం బ్రిడ్జ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రపంచంలోని అన్ని వైరస్ ల నిరోధానికి పని చేసేలా ఒకే మందు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. 'డయోస్ -కొవాక్స్ 2 ' పేరుతో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నట్లు కేం బ్రిడ్జ్ యూనివర్సిటీ పేర్కొంది. నిజంగా ఇది విజయవంతమై వ్యాక్సిన్ విడుదలయితే చాలా వైరస్ ఇన్ఫెక్షన్ల నిరోధానికి అడ్డుకట్ట వేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ కు గబ్బిలాలు సహా అన్ని రకాల జన్యు శ్రేణులను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. భవిష్యత్ లో జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే అన్ని రకాల వైరస్ ల నాశనానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్ అన్ని రకాల పరీక్షలను పూర్తి చేసుకుంది. ఈ వ్యాక్సిన్ ను సూదిలా వేయకుండా స్ప్రింగ్ -పవర్ జెట్ ఇంజక్షన్ ద్వారా నొప్పి లేకుండా చర్మంలోకి ప్రవేశపెట్టొచ్చు. జంతువుల వల్ల మానవుడికి సోకే వైరస్ లు అన్నింటినీ సమర్థవంతగా ఎదుర్కొనేందుకే ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నట్లు కేం బ్రిడ్జ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.