Begin typing your search above and press return to search.
శుభవార్త : దేశంలో చిన్నారులకు టీకా .. ఎప్పటినుండంటే ?
By: Tupaki Desk | 28 Jun 2021 6:34 AM GMTమనదేశం లో 12-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కరోనా వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అరోరా ఓ ప్రకటనలో తెలిపారు. జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ పూర్తి అయిందని, దేశంలో ఈ టీకామందు త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. డీఎన్ ఏ వ్యాక్సిన్లను డెవలప్ చేస్తున్న ఈ సంస్థ తన క్లినికల్ ట్రయల్స్ ని ముగించిందని, సమీప భవిష్యత్తులో ఈ వయస్కులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని తన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ మేనేజ్ మెంట్ పై సుప్రీంకోర్టు తనకు తానుగా దీనికి సంబంధించిన కేసును విచారిస్తోంది.
ఈ ఏడాది అంతానికి అన్ని కంపెనీల నుంచి 135 కోట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఆగస్టు నుంచి కోవీషీల్డ్ 50 కోట్లు, కోవ్యాగ్జిన్ 40 కోట్లు, బయో ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్ 30 కోట్లు, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 10 కోట్ల డోసుల మేర మనకు లభిస్తుందని ఈ అఫిడవిట్ లో తెలిపారు. దీనితో చాలావరకు వ్యాక్సిన్ కొరత తీరుతుందని దృఢంగా నమ్ముతున్నారు. జూన్ 25 వరకు దేశ వ్యాప్తంగా ప్రజలకు 31 కోట్ల డోసులకు పైగా టీకామందు ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో హెల్త్ వర్కర్స్ కి 1.73 కోట్ల డోసులు ఇచ్చినట్టు. అలాగే 18-44 ఏళ్ళ మధ్య వయస్కులకు 7.84 కోట్ల డోసుల టీకామందు ఇచ్చామని, ఈ సంవత్సరాంతానికి జనాభాకంతటికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నది లక్ష్యమని వివరించారు. జూన్ 21 న ఇండియూ వ్యాప్తంగా 86 లక్షలమందికి పైగా టీకాలు ఇవ్వనున్నారు.
ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. దేశంలో చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తే అదొక మైలురాయే. ఇప్పటికే పలు దేశాల్లో చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇది పాఠశాలలు తెరిచేందుకు ఉపయోగపడుతుంది. భారత్ బయోటెక్ 2-18 వయసుల వారికి వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే మూడో దశ ట్రయల్స్ కూడా పూర్తి చేసింది. ఇది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫైజర్, జైడస్ క్యాడిలాకు అనుమతులు వస్తే వ్యాక్సినేషన్ వేగవంతం అవుతుంది అని అన్నారు.