Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌ నెటిజన్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన గూగుల్‌ సీఈవో!

By:  Tupaki Desk   |   25 Oct 2022 4:46 AM GMT
పాకిస్థాన్‌ నెటిజన్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన గూగుల్‌ సీఈవో!
X
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఇండియా–పాకిస్థాన్‌ టీ–20 మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠ మధ్య అందరికీ వినోదం పంచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చివరి ఓవర్లలో విరాట్‌ కోహ్లీ విశ్వరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఒంటి చేత్తో భారత్‌కు విజయాన్ని సాధించిపెట్టాడు. తద్వారా తనపై వస్తున్న విమర్శలకు ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ చెక్‌ పెట్టాడు.

మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు ఏకంగా 90 వేల మంది హాజరయ్యారు. వీరిలో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం. భారత జాతీయ గీతం జనగణమన నినాదాలతో స్టేడియం హోరెత్తింది.

కాగా ఈ మ్యాచ్‌ చూసిన గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌.. తన సంతోషాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ''అందరికీ హ్యాపీ దివాళీ.. ఈ గొప్ప సమయాన్ని అందరూ తమ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఇండియా – పాక్‌ మ్యాచ్‌ చివరి మూడు ఓవర్లు మరోసారి చూడటం ద్వారా నేను దీపావళిని సెలబ్రేట్‌ చేసుకున్నాను. అద్భుతమైన ఆట.. అద్భుతమైన ప్రదర్శన'' అంటూ సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా, టీ20 వరల్డ్‌ కప్‌ 2022 అనే హ్యాష్‌ ట్యాగ్‌లను ఆయన ట్వీట్‌కు జత చేశారు.

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌కు స్పందించిన పాకిస్థానీ నెటిజన్‌ తన వదరుబోతుతనాన్ని ప్రదర్శించాడు. ముమహ్మద్‌ షహజీబ్‌ అనే పాకిస్థానీ.. మీరు బౌలింగ్‌ తొలి మూడు ఓవర్లు కూడా చూడండని సమాధానం ఇచ్చాడు. అతడు వెటకారాన్ని అర్థం చేసుకున్న సుందర్‌ పిచాయ్‌ అవి కూడా చూశాను. భువనేశ్వర్‌ కుమార్, అర్షదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారంటూ భారత బౌలర్లను కొనియాడాడు.

తొలి మూడు ఓవర్లలో పాక్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. రాహుల్‌ 4 పరుగులకే ఔటయ్యాడు. దీన్ని ఉద్దేశించే సదరు పాకిస్థానీ నెటిజన్‌ అలా ట్వీట్‌ చేశాడు.

కాగా సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌తో దిమ్మతిరిగిన పాకిస్థానీ నెటిజన్‌.. నేను చెప్పింది టీమిండియా ఇన్నింగ్స్‌ అంటూ సమాధానమిచ్చాడు. ఇక ఈ ట్వీట్‌ను సుందర్‌ పిచాయ్‌ పట్టించుకోలేదు.

అయితే భారత నెటిజన్లు ఆ పాకిస్థానీ నెటిజన్‌ను దుమ్ములేపి వదిలిపెట్టారు. సుందర్‌ పిచాయ్‌ సమయస్ఫూర్తిని పొగుతుడూ పాకిస్థానీ నెటిజన్‌పై మండిపడ్డారు. సుందర్‌ పిచాయ్‌ అంతటి గొప్ప వ్యక్తి నిన్ను ట్రోల్‌ చేశాడు. ఆయన నీ ట్వీట్‌కు సమాధానం ఇచ్చిన ట్వీట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి లామినేట్‌ చేయించి నీ బెడ్‌ రూమ్‌లో ఉంచుకో. అది కోట్లాది రూపాయలు విలువ చేసే పెయింటింగ్‌ లాంటిది. ఇంకా ఏడవటం ఆపేయ్‌ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక చివరకు దిగి వచ్చిన పాకిస్థానీ నెటిజన్‌.. సుందర్‌ పిచాయ్‌ తనకు రిప్లయ్‌ ఇచ్చిన లామినేషన్‌ చేయించి పెట్టుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను అతడు తిరిగి ట్వీట్‌ చేయడం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.