Begin typing your search above and press return to search.

ప్రభుత్వం కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది..ఇది దురదృష్టకరం: సీజే రమణ

By:  Tupaki Desk   |   9 April 2022 7:31 AM GMT
ప్రభుత్వం కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది..ఇది దురదృష్టకరం: సీజే రమణ
X
సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్ వి రమణ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు న్యాయమూర్తుల పరువు తీసేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయని అన్నారు. ఇది కరెక్ట్ కాదని తెలిపారు. ఛత్తీస్ గఢ్ కు సంబంధించిన ఓ కేసు విషయంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి రమణ సింగ్ పై నమోదైన అవినీతి కేసును కొట్టి వేసినట్లు సమాచారం. అయితే ఈ కేసు విషయంలో త్రిసభ్య ధర్మాసనానికి అధ్యక్షత వహిస్తున్న ఆయన ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ అమన్ సింగ్, భార్య యాస్కిన్ సింగ్ లపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ కేసు విషయాన్ని పక్కనబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

అయితే ఈ కేసుకు సంబంధించి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సిత్ శర్మ చేసిన ఫిర్యాదు మేరకు ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసు ఆర్థిక నేరాల విభాగం 2020 ఫిబ్రవరి 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. అమన్ సింగ్, అతని భార్యపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు విషయంలో విచారణ జరిపించాలని ఉత్సత్ శర్మ డిమాండ్ చేశారు.

అయితే ఫిబ్రవరి 28న అమన్ సింగ్, అతని భార్యపై ఎటువంటి బలవంతపై చర్యలు తీసుకోరాని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పిటినర్ చేసిన ఆరోపణలన్నీ సంభావ్యతపై ఆధారపడి ఉన్నాయని, అందువల్ల ఏ వ్యక్తినీ విచారించలేమని హైకోర్టు ఎఫ్ఐఆర్ ను రద్దు చేసింది.

కానీ సాహియా శర్మ ఫిర్యాదును ముఖ్యమంత్రి సమర్థించారని, దీనిపై విచారణ చేయాలని హైకోర్టు తెలిపింది. దీంతో అమన్ సింగ్ పై 2019 నవంబర్ 11న విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉత్సిత్ శర్మతో సహా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన సీజే ఈ విషయంలో కలత చెందారు. ఈరోజు కొత్త ట్రెండ్ మొదలైంది... కోర్టులో కూడా చూస్తున్నామన్నారు. ఇది న్యాయమూర్తుల పరువు తీసేలా ఉందన్నారు. ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని, ఇది చాలా దురదృష్టకరమన్నారు. వాస్తవానికి ఛత్తీస్ గఢ్ హైకోర్టు ఆదేశాలపై అప్పీల్ ను న్యాయమూర్తులు మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారిస్తున్నప్పుడు జస్టిసర్ రమణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.