Begin typing your search above and press return to search.
ఈటలపై వేటుకు రంగం సిద్ధం.. ఆ మాటకు సర్కారు సీరియస్
By: Tupaki Desk | 7 Sep 2022 6:42 AM GMTరాజకీయాల్లో దూషణలు మామూలుగా సాగేవే. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో వీటి తీవ్రత మరింత ఎక్కువైంది. తాము సానుకూలంగా ఉన్న వేళలో.. ప్రధానమంత్రి మీద పల్లెత్తు మాట అన్నంతనే విరుచుకుపడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. లెక్కలు తేడా వచ్చేసిన తర్వాత అదే ప్రధానిని ఉద్దేశించి ఎన్నేసి మాటలు.. ఎంత ఘాటుగా అంటున్నారో చూస్తున్నదే. ఇలాంటి సమయాల్లో నేతల నోటి నుంచి వచ్చే మాట కంటే కూడా.. అది వచ్చే సమయం..
సందర్భం మాత్రమే కీలకంగా మారింది. గతంలో మాదిరి మాటలు తీవ్రతగా ఉన్నప్పుడు స్పందించే ధోరణి కంటే కూడా తమ వ్యూహానికి అనుగుణంగా అందుకు తగ్గట్లుగా పరిస్థితుల్ని తమకు తగ్గట్లుగా మార్చుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. దీనికి కారణం ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాటగా చెబుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ ను ఉద్దేశించి 'మరమనిషి' అన్న విమర్శపై తెలంగాణ సర్కారు సీరియస్ అయ్యింది. స్పీకర్ ను ఉద్దేశించి ఇంత మాట అంటారా? కచ్ఛితంగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
ఈటల నోటి నుంచి వచ్చిన మాటను ఆధారంగా చేసుకొని అసెంబ్లీ నుంచి ఆయన్ను ఎక్స్ పెల్ చేసే దిశగా సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టే ఆలోచనను చాలా సీరియస్ గా చేస్తున్నట్లు చెబుతున్నారు. మంగళవారం మొదలైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు త్వరగా ముగియటంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. 'స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక మరమనిషిలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది చేయటం తప్పించి.. స్పీకర్ పోచారానికి వేరే పని లేదు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ మీటింగ్ కు పిలిచేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సభా సంప్రదాయాల్ని తుంగలోకి తొక్కుతోంది' అంటూ మండిపడ్డారు.
ఈటల వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సభాపతిని పట్టుకొని మరమనిషి అంటూ కించపరుస్తూ మాట్లాడతారా? అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ఎన్ని రోజులు ఉంటుందన్నది బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్న ఆయన..
స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకుక క్షమాపణలు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రిచెప్పినట్లుగా స్పీకర్ వింటున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సభాపతి స్థానాన్ని అగౌరవపరుస్తున్నట్లుగా ఆయన మండిపడ్డారు. స్పీకర్ కు ఈటల భేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఒకవేళ.. నిజంగానే ఈటలపై అనర్హత వేటు వేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కటం ఖాయమని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.