Begin typing your search above and press return to search.

సర్కారు చెప్పింది.. ఫార్మా కంపెనీలు తగ్గించాయి.. ఏ కంపెనీ రెమ్ డెసివర్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   18 April 2021 3:11 AM GMT
సర్కారు చెప్పింది.. ఫార్మా కంపెనీలు తగ్గించాయి.. ఏ కంపెనీ రెమ్ డెసివర్ ఎంతంటే?
X
కొన్ని విషయాల్లో ప్రభుత్వం అనుసరించే విధానాలు.. పద్దతులు ఒక పట్టాన అర్థం కావు. రెండో దశలో పట్ట పగ్గాల్లేకుండా పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో బాధితులకు అవసరమైన కొన్ని మందుల కొరత అంతకంతకూ పెరుగుతోంది. వైరస్ లోడ్ అధికంగా ఉన్న వారికి.. తక్షణ రిలీప్ కోసం రెమ్ డిసివర్ ఇంజక్షన్ అవసరమని వైద్యులు చెబుతున్నారు. దీంతో దీని కొరత పెరిగిపోయింది. మరోవైపు.. సెకండ్ వేవ్ కు తగ్గట్లుగా ఫార్మా కంపెనీలు పెద్దగా ఫోకస్ చేయకపోవటం.. రెమ్ డెసివర్ లాంటి వాటిని పెద్ద ఎత్తున ఎగుమలు చేస్తుండటంతో.. అనూహ్యంగా పెరిగిన కేసులకు తగ్గట్లుగా రెమ్ డిసవర్ నిల్వలు లేని పరిస్థితి. దీంతో.. ఫార్మా కంపెనీలు ధరల్ని భారీగా పెంచేశాయి.

అవసరం ఎక్కువ కావటం.. సప్లై తక్కువగా ఉండటంతో రెమ్ డెసివర్ ధర ఆకాశమే హద్దు అన్నట్లుగా సాగుతోంది. ఈ ఇంజక్షన్ తో ప్రాణాలు నిలుస్తాయని నమ్ముతున్నారు. దీంతో.. ఎవరికి వారు రెమ్ డెసివర్ కోసం తిప్పలు పెరిగిపోయాయి. మరోవైపు.. వీటిని ఉత్పత్తిచేసే కంపెనీల వద్ద కూడా వీటి నిల్వలు పెద్దగా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటి ధరలు భారీగా పెరిగిపోవటమే కాదు.. బ్లాక్ మార్కెట్ లో మాత్రమే దొరికే దుస్థితి. ఇలాంటివేళ.. కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో రెమ్ డిసెవర్ ధరల్ని తగ్గించాలని కోరింది.

దీంతో.. రెమ్ డిసివర్ ధరను తగ్గిస్తున్నట్లుగా పలు ఫార్మాసీ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇంత డిమాండ్ ఉన్న వేళ.. ధరల్ని తగ్గించటం సరే..ముందు ఉత్పత్తి మరింత పెరిగేలా చూడటం.. కొరత అనే మాట వినిపించకుండా చేయండన్న ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకానీ.. ధరల్నితగ్గించాలన్న మాట వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు.

అయితే.. ఈ లాజిక్ ను పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం మాత్రం ధరల్ని తగ్గించే అంశం మీద కసరత్తు చేస్తుందే తప్పించి.. కొరత అనే మాట రాకుండా చేయాలన్నది పట్టటం లేదు. అంతేకాదు.. ధరల్ని తగ్గించిన తర్వాత సరకు తయారు కాకపోతే ఏం చేస్తారు? అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే.. బయటమార్కెట్లో ఎంత ధరకైనా సొంతం చేసుకోవాలని తపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ధరల ప్రస్తావన వల్ల పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు.

ఇదిలాఉంటే.. ప్రభుత్వ జోక్యంతో ఈ ఇంక్షన్ ధరను పలుఫార్మా కంపెనీలు తగ్గించాయి. ఇంతకూ ఏ కంపెనీ ఎంత మొత్తాన్ని తగ్గించారన్నది చూస్తే..

కంపెనీపేరు పాత ధర కొత్త ధర
క్యాడిల్లా రెమ్ డ్యాక్ రూ.2800 రూ.899
సిన్ జీన్ ఇంటర్నేషనల్ రెమ్ విన్ రూ.3950 రూ.2450
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రూ.5400 రూ.2700
మైలాన్ రూ.4800 రూ.3400
జూబ్లియంట్ జెనరిక్స్ రూ.4700 రూ.3400
హెటిరో హెల్త్ కేర్ రూ.5400 రూ.3490
సిప్లా సిప్రిమి రూ.4000 రూ.3000