Begin typing your search above and press return to search.
ఏపీ మద్యం దందాలో మంత్రుల హస్తం ...ఆ ఇద్దరు మంత్రులెవరంటే ?
By: Tupaki Desk | 22 Feb 2020 6:15 AM GMTఏపీ సీఎం జగన్ ..అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆడపడచుల విన్నపం , ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే దశల వారీగా మధ్య నిషేధం చేయడానికి పూనుకొని , మద్యంపై రాష్ట్రంలో ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 8 తరువాత మధ్య అమ్మకూడదు. అలాగే మద్యం ధరలని కూడా బాగా పెంచేశారు. అలాగే ఒకరికి రెండు బాటిల్స్ మాత్రమే ఇస్తారు అని చెప్పడంతో మందు బాబులకు కష్టాలు తప్పడంలేదు. ఇది రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతున్నా కూడా సీఎం మాత్రం మద్యాన్ని నిషేదించడానికే నిర్ణయం తీసుకున్నారు.
అయితే, సీఎం తీసుకున్న ఈ నిర్ణయం మరికొందరి పాలిట వరంలా మారింది. ముఖ్యంగా ఏపీలో మద్యంపై ఆంక్షలు కొనసాగుతుండటం తో తెలంగాణ కాసుల పంట పండిస్తోంది. నూతన పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం రేట్లను భారీగా పెంచేయడంతోపాటు, ఇష్టమైన బ్రాండ్లు కూడా లేకపోవడంతో, తెలంగాణ లో తమకు నచ్చిన బ్రాండ్ల మద్యం తక్కువ ధరకే లభిస్తుండటంతో మందుబాబులు రెండు రాష్ట్రాల సరిహద్దులోని తెలంగాణ వైపు ఉన్న మద్యం దుకాణాలకు క్యూ కడుతున్నారు. దీనితో ఏపీలో మద్యం ఆదాయం తగ్గిపోతుండగా.. తెలంగాణకు భారీ ఆదాయం వచ్చి చేకూరుతోంది.
ఏపీలో చీప్ లిక్కర్ ధరకే తెలంగాణ లో బ్రాండ్ మద్యం లభిస్తోంది. దీంతో సరిహద్దులోని వారంతా తెలంగాణ దుకాణాలకు తరలుతున్నారు. ఏపీలో మద్యం ధరలు పెరగడం ఒక ఎత్తు , అలాగే టైం స్లాట్ పెట్టడం , ధర ఎక్కువగా పెట్టినప్పటికీ ఇష్టమైన బ్రాండ్స్ దొరకకపోవడంతో మద్యం ప్రియులు ..కూతవేటు దూరంలో ఉండే ..సరిహద్దు ప్రాంతాలకి వెళ్లి , కావాల్సిన కాడికి మద్యాన్ని తీసుకోని తాగి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు, ముఖ్యంగా కర్నూల్ జిల్లా వాసులు , కృష్ణా , గుంటూరు జిల్లా వాసులకి తెలంగాణ బార్డర్ చాలా తక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్కడికి వెళ్లి చీఫ్ గా దొరికే మందు తాగడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
కాగా , ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలకి వెళ్లి , మద్యం తీసుకోని తాగుతుండటం తో రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతుంది. దానికి తోడు ..తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటం, రాత్రి 8 తరువాత మద్యం దొరకకపోవడంతో ..సరిహద్దు రాష్ట్రాలైన ,తమిళనాడు , తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని చీఫ్ గా అమ్ముతున్నారట. ఈ భారీ స్కామ్ లో ఏపీకి చెందిన ఇద్దరు మంత్రుల హస్తం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ప్రభుత్వమే మద్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేయాలనీ కంకణం కట్టుకొని ..దశలవారీగా మద్యాన్ని పూర్తిగా రాష్ట్రం నుండి తీసేయాలని చూస్తున్న తరుణంలో ..రాష్ట్ర మంత్రులే , పక్క రాష్ట్రాల నుండి మద్యాన్ని తెప్పించి , చీఫ్ గా అమ్మకాలు ప్రారంభిస్తే ..ఏపీ సర్కార్ తీసుకున్న మద్యపాన నిషేధాన్ని ఎలా పూర్తి చేస్తుందో ..అయితే , ప్రస్తుతం ఏపీలో లిక్కర్ దందా చేస్తున్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరు? అని విపరీతంగా చర్చ నడుస్తోంది.