Begin typing your search above and press return to search.
పని మనిషిని బ్లాక్ మెయిల్ చేస్తున్న హీరోయిన్..!
By: Tupaki Desk | 12 Nov 2022 7:52 AM GMTతమిళ, కన్నడ సినిమాలు చేస్తూ పాపులర్ అయిన పార్వతీ నాయర్ చెన్నైలోని నుంగంబాకంలో ఉంటున్నారు. అక్టోబర్ లో ఆమె ఇంట్లో చోరీ జరిగింది. 9 లక్షలు విలువ చేసే రెండు వాచ్ లు.. 2 లక్షల విలువ చేసే ఒక ల్యాప్ టాప్. లక్షన్నర విలువ చేసే ఐఫోన్ మిస్ అయ్యాయి. ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది పార్వతి నాయర్. తన ఇంట్లో పని చేస్తున్న సుభాశ్ మీదే ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు తన అభిప్రాయం చెప్పగా సుభాశ్ ని విచారించారు.
ఈ దర్యాప్తులో భాగంగా సుభాశ్ కొన్ని సంచలన విషయాలను వెళ్లడించారు. తనపై లైంగిక వేధిపుల కేసు పెడతానని.. పార్వతి నాయర్ ఇంట్లో జరిగిన చోరీకి తనని మానసికంగా వేధిస్తున్నట్టు అతను చెప్పాడు. పార్వతి నాయర్ తన మీద రెండు సార్లు చేయి చేసుకుందని.. మొహం మీద ఉమ్మికూడా వేసిందని విచారణలో వెళ్లడించాడు సుభాశ్. ఆమె కావాలనే తనని ఈ దొంగతనం కేసులో ఇరికించిందని చెప్పాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి కలిశారని అప్పటి నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని అని చెప్పాడు సుభాశ్.
తన దగ్గర పనిచేస్తున్న సుభాష్ చెప్పిన విషయాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్వతి నాయర్ మీద ఆమె దగ్గర పనిచేస్తున్న వ్యక్తి చెప్పిన విషయాలను.. ఆమె అతని మీద చేస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. సెలబ్రిటీస్ ఇల్లలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న వారు ఉన్నారు. సెలబ్రిటీస్ ఇంట్లో ఇలాంటి చోరీకి సర్వసాధారణం అయ్యాయి. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో దొంగతనానికి ఒక వ్యక్తి ప్లాన్ చేసి దొరికిపోయాడు. హీరోల ఇంటికైతే భారీ సెక్యురిటీ ఉంటుంది. కానీ హీరోయిన్స్ మాత్రం వారెంత సెలబ్రిటీస్ అయినా మాములుగానే ఉంటారు.
పార్వతి నాయర్ ఇంట్లో చోరీ కేసు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉంది. పని మనిషి మీద ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అంతట హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు సుభాశ్ అనే వ్యక్తిని పార్వతి నాయర్ కొట్టినట్టు తన మీద ఉమ్మివేసి అవమాన పరిచినట్టు చెప్పడంతో కేసు మరింత బలంగా మారింది. మరి ఈ కేసులో ఎవరు చెప్పింది నిజం.. ఎవరు డ్రామాలాడుతున్నారు అన్నది మరికొద్దిరోజుల్లోనే పోలీసులు క్లారిటీ ఇస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.