Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ కి మందు కనిపెట్టిన హీరోయిన్
By: Tupaki Desk | 1 Feb 2020 7:07 AM GMTకరోనా వైరస్ ..ప్రస్తుతం ఈ ప్రమాదకర వైరస్ దాదాపు 200 మందికి పైగా చైనీయులను పొట్టనపెట్టుకుంది. ప్రపంచం వ్యాప్తంగా 10,000 మందికి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. అటు చైనా తో పాటుగా మరో 18 దేశాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాధిబారిన పడినవారు చైనా తరువాత ఆస్ట్రేలియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఎక్కువమంది ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక , భారత్ లో కూడా కరోనా వైరస్ తొలి కేసు నమోదయ్యింది. కేరళకు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్రం నిర్ధారించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. అలాగే వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. దీనికోసం ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే , ప్రముఖ వైద్యులే కరోనా వ్యాధికి వైద్యం లేదని చెప్తుండటంతో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను ఇలా నిరోధించవచ్చు అంటోంది నటి నివేదాపేతురాజ్. కరోనా వ్యాధిని నిరోధించడానికి ఒక టిప్‌ను తెలిపింది. ఒక గుర్తింపు పొందిన నటుడు గానీ నటి గానీ ఏ విషయం గురించి అయినా చెప్పారంటే అది సగటు ప్రజల్లోకి వెళ్ళి పోతుంది . అలానే నటి నివేదాపేతురాజ్ కరోనా వైరస్ ను ఇలా నిరోధించవచ్చు ఒక చిట్కాను తన ఇన్ స్ట్రాగామ్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో పసుపు, తులసి, అల్లం కలిపిన కషాయాన్ని తాగుతున్న ఫొటోను పోస్ట్ చేసి ఫైట్ కరోనా వైరస్ అనే ట్యాగ్‌ను పొందుపరిచింది. ఈ కషాయంతో కరోనా వ్యాధిని నిరోధించవచ్చునని నటి నివేదాపేతురాజ్ తెలిపింది. అయితే, అంతా బాగానే ఉంది కానీ ఈ నటి చెప్పిన నాటు వైద్యం నిజంగానే కరోనా వైరస్ ను నిరోధిస్తుందా, అంటే ఎలాంటి అధరాలు లేవు.