Begin typing your search above and press return to search.

స్వర్ణ ప్యాలెస్ నిందితులకు కోర్టు షాక్

By:  Tupaki Desk   |   17 Aug 2020 3:52 PM GMT
స్వర్ణ ప్యాలెస్ నిందితులకు  కోర్టు షాక్
X
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో 10 మంది కోవిడ్ రోగులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులకు తాజాగా హైకోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ కోసం వారు పెట్టుకున్న పిటీషన్ ను 21వ తేదీకి వాయిదా వేసింది.

ఇక పోలీసులు వేసిన ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలనే పిటీషన్ ను కూడా కలిపి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు న్యాయమూర్తి .. రమేశ్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రమేశ్ బాబు ముందస్తు బెయిల్ పీటీషన్ ను 21వ తేదికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వీరు రిమాండ్ లో కొనసాగనున్నారు.

రమేశ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు.. చైర్మన్ అయిన రమేశ్ బాబు.. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు కేసులు నమోదు చేయడంతో పరారీలో ఉన్నారు. రమేశ్ ఆచూకీ కోసం ఇప్పటికే విజయవాడ పోలీసులు 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

రమేశ్ కోసం జల్లెడ పడుతున్న పోలీసులు.. బిజీగా ఉండగానే.. డాక్టర్ రమేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో మాత్రం ఆయనతోపాటు ఇతర నిందితులకు సైతం చుక్కెదురైంది.