Begin typing your search above and press return to search.

ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   23 Dec 2020 10:13 AM GMT
ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
X
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి సీఎం జగన్ కు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య భారీ ఫైట్ సాగుతోంది. ఈ క్రమంలోనే వీరి పంచాయితీ హైకోర్టుకు ఎక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. ఎస్ఈసీని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలువాలని హైకోర్టు సూచించింది.

ఇక కరోనాను అడ్డుగా చూపిన ఏపీ సర్కార్ కు హైకోర్టు షాకిచ్చింది. కరోనా పరిస్థితులపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.

ఇక అధికారుల బృందం ఎస్ఈసీతో చర్చించిన అంశాలను తెలుపాలని.. దీనికి సంబంధించి ఈనెల 29న తదుపరి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది.

ఇక కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్రం కనుక షెడ్యూల్ విడుదల చేస్తే దానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.