Begin typing your search above and press return to search.
అత్యంత పురాతన కేసులో తాజాగా వెల్లడైన తుది తీర్పు..!
By: Tupaki Desk | 19 Jan 2023 5:30 AM GMTదేశంలోనే అత్యంత పురాతనమైన 72 ఏళ్ల వ్యాజ్యాన్ని కలకత్తా హైకోర్టు కిందటి వారం కొట్టివేసింది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి న్యాయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత నమోదైన పలు కేసుల్లో ఇంకా తుది తీర్పు వెలువడలేదు. ఇలాంటి వాటిలో 19 నవంబర్ 1948లో నమోదైన కేసు ఒకటిగా నిలిచింది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు 72 ఏళ్ల తర్వాత వెలువడం గమనార్హం.
ఈ కేసు నవంబర్ 19, 1948 నాటిది కాగా బెర్హంపూర్ బ్యాంక్ లిమిటెడ్ మరియు లిక్విడేషన్‌కు సంబంధించింది. ఈ కేసులో నాడు దివాలా తీసిన బెర్హంపూర్ బ్యాంకును మూసివేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ 1951 జనవరి 1న ఒక పిటిషన్ దాఖలైంది. ఈ కేసు నెంబర్ 71/1951గా నాడు నమోదు చేయబడింది.
ఇందులో భాగంగా బకాయిదారుల నుంచి డబ్బు వసూలు చేసేందుకు బ్యాంకు అనేక వ్యాజ్యాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు చేసిన క్లెయిమ్‌లను సవాలు చేస్తూ చాలామంది బకాయిదారులు కోర్టును ఆశ్రయించారు. ఇదే క్రమంలోనే 2022 సెప్టెంబరులో హైకోర్టులో రెండుసార్లు ఈ కేసు విచారణకు రాగా ఎవరూ హాజరు కాలేదు.
ఈ మేరకు జస్టిస్ కపూర్ కోర్టు లిక్విడేటర్ నుంచి నివేదికను కోరారు. దీంతో 2006 ఆగస్టు 2006లోనే పరిష్కరించారని అయితే రికార్డులో పేర్కొకపోవడంతోనే ఈ కేసు పెండింగ్‌లో ఉన్నట్టుగా నిర్ధారించబడిందని తెలిపారు. ఇదే విషయాన్ని 2022 సెప్టెంబర్ 19న కోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలోనే జనవరి 9న జస్టిస్ రవి కిషన్ కపూర్ గతేడాది సెప్టెంబర్ 19 నాటి డిస్పోజల్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
దీంతో 72 ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న పురాతన కేసుకు గతవారం తుది తీర్పు ఇచ్చినట్లయింది. నవంబర్ 19, 1948 న దాఖలైన ఈ కేసును కలకత్తా హైకోర్టు పరిష్కరించడంతో దేశంలో మరో ఐదు పురాతన కేసుల్లో ప్రస్తుతం మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులన్నీ 1952లో నమోదయ్యాయి. వీటిలో రెండు సివిల్ కేసులు ఉన్నాయి.
వీటిలో మాల్దాలోని సివిల్ కోర్టులో ఒకటి. మద్రాసు హైకోర్టులో మరొకటి పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇవి కాక మన భారతదేశ కోర్టులో వేలాది కేసులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుల్లోని బాధితులకు ఎప్పటికీ న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.