Begin typing your search above and press return to search.

ఇన్నిరోజులు ఏం చేశారు..? ఇప్పుడే గుర్తొచ్చిందా..?

By:  Tupaki Desk   |   13 Nov 2021 7:30 AM GMT
ఇన్నిరోజులు ఏం చేశారు..? ఇప్పుడే గుర్తొచ్చిందా..?
X
తిరుమల తిరుపతి దేవస్థానం న్యాయ అధికారిని కొనసాగించడంపై వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను నియామకం అయి చాలా రోజులైందని, ఇంతకాలం ఏం చేశారని పిటిషినర్ తరుపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ను ప్రశ్నించింది. ఈ విచారణపై సమయం కావాలని కోరుతున్నా.. డిమాండ్ చేసేలా వ్యవహరిస్తే పిటిషన్ కొట్టివేస్తామని హెచ్చరించింది. దీంతో ఈ పిటిషన్ విషయంలో జడ శ్రవణ్ కుమార్ మొట్టికాయాలు తినాల్సి వచ్చింది. అంతేకాకుండా జడ శ్రవణ్ కుమార్ చేసిన వాదనపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

2019లో టీటీడీ లీగల్ అధికారిగా రిటైర్డ్ న్యాయశాఖాధికారి రెడ్డెప్పరెడ్డిని ప్రభుత్వం నియమించింది. అయితే 2020 జనవరి 22న ప్రభుత్వం జీవో 16ను జారీ చేసింది. దీని ప్రకారం సర్వీసులో ఉన్న అధికారినే కొనసాగించాలని తెలిపింది. అంటే రెడ్డెప్పరెడ్డి 2022 డిసెంబర్ వరకు పదవీ కాలాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. రెడ్డెప్పరెడ్డిని న్యాయ అధికారిగా కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

పిటిషన్ తరుపున జడ శ్రవణ్ కుమార్ వాదలను వినిపించారు. ‘టీటీడీ లీగల్ అధికారిగా రిటైర్డ్ న్యాయశాఖాధికారి రెడ్డెప్పరెడ్డిని నియమించారు.ఈ ఏడాది జనవరి 22న ఈ అధికారిని కొనసాగిస్తూ జీవ జారీ చేశారు. ఆయన ముందుగా నియమించిన ప్రకారం పదవీ కాలం వచ్చేనెల 6తో ముగుస్తుంది. ఈ వ్యాజ్యంపై అత్యవసంగా విచారణ జరిపించాలని కోరారు. ఈ విచారణ ఆలస్యమైతే పిటిషన్ అనర్హత కిందికి వస్తుంది’ అని అన్నారు.

అయితే శ్రవణ్ కుమార్ వాదనలపై హైకోర్టు సీరియస్ అయింది. ‘విచారణ త్వరగా చేపట్టాలని డిమాండ్ ఎల చేస్తారు..అలంటప్పుడు ఇన్నిరోజులు ఏం చేశారు..? ఇప్పుడే ఈ విషయం గుర్తొకొస్తుందా..? త్వరగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తే పిటిషన్ కొట్టివేస్తాం’ అంటూ ధర్మాసంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు టీటీడీ తరుపున న్యాయవాది వివరాలను సమర్పించేందుకు సమయం ఇవ్వాలని గడువు కోరాడు.