Begin typing your search above and press return to search.
ముగ్గురు సీపీలకు చెమటలు పట్టే పని పెట్టిన హైకోర్టు
By: Tupaki Desk | 11 May 2021 3:30 PM GMTఅంచనాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో లాక్ డౌన్ నిర్ణయాన్నిప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా అనుకున్న దాని ప్రకారం.. రంజాన్ తర్వాత లాక్ డౌన్ విధించాలని భావించినా.. హైకోర్టు నుంచి అనూహ్యంగా ఎదురైన ఆగ్రహంతో.. కాస్త తగ్గిన ప్రభుత్వం హడావుడిగా బుధవారం ఉదయం నుంచి లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. కరోనా తీవ్రతను తగ్గించేందుకు.. లాక్ డౌన్ మీద ప్రభుత్వ నిర్ణయం తమకు చెప్పాలన్న హైకోర్టు మాటకు.. కేసు విచారించటానికి కాస్త ముందుగా.. లాక్ డౌన్ మీద అధికారిక ప్రకటన చేసింది.
ప్రభుత్వ ప్రకటన మీద హైకోర్టు కూసింత అసంత్రప్తి వ్యక్తమైంది. అయితే.. అనూహ్యంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ మహానగరం మొత్తం పోలీసింగ్ మూడు కమిషనరేట్లు (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) పరిధిలో ఉంటుంది. ఈ మూడింటికి వేర్వేరుగా సీపీ (కమిషనరేట్ ఆఫ్ పోలీస్) లు ఉంటారు. హైదరాబాద్ కు అంజనీ కుమార్.. రాచకొండకు మహేశ్ భగవత్.. సైబరాబాద్ కు సజ్జన్నార్ లు ఉంటారు.
ఈ ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులకు లాక్ డౌన్ నేపథ్యంలో భారీ టాస్కు ఇచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పది రోజుల లాక్ డౌన్ లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల మధ్యలో అన్ని షాపులు తీసుకునే వీలుంది. ఈ వేళలో.. ప్రభుత్వం చెప్పినట్లుగా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని ఆయా సీపీల పరిధిలో మొత్తం వీడియో గ్రఫీ చేయించాలని ఆదేశించింది.
అంతేకాదు.. కోవిడ్ నిబంధనల్ని పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశం.. ఈ ముగ్గురు సీపీలకు చెమటలు పట్టించేలా ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. కమిషనరేట్ పరిధి మొత్తంలో లాక్ డౌన్ వెసులుబాటు ఉండే నాలుగు గంటల సమయాన్ని షూట్ చేయింటం అంటే అంత తేలికైన పని కాదన్నది మర్చిపోకూడదు. మరేం చేస్తారో చూడాలి.