Begin typing your search above and press return to search.

సీఎం జగన్ మరో నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   12 July 2021 10:00 PM IST
సీఎం జగన్ మరో నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు
X
గ్రామ సచివాలయాలలో అధికారాలను సర్పంచ్ ల నుంచి గ్రామ రెవెన్యూ అధికారులకు బదిలీ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

గుంటూరు జిల్లాలోని తోకలవనిపాలెం గ్రామానికి చెందిన సర్పంచ్ టీ. కృష్ణమోహన్ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. మార్చిలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేసింది. సర్పంచ్ ల అధికారాలను ఉపసంహరించుకొని గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగించింది.

సర్పంచ్ లు, వార్డు సభ్యులతో సహా ఎన్నికైన సంస్థలతో ఇప్పటికే గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తూ పంచాయతీ రాజ్ స్ఫూర్తికి విరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది. గ్రామాలలో సమాంతర పరిపాలనను గ్రామ కార్యదర్శులు నిర్వహిస్తారని భావించారు.

ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ఆశ్చర్యపోయింది. గ్రామ సచివాలయాల ఏర్పాటుపై పిటీషన్ ను హైకోర్టు విచారించినప్పటికీ ప్రభుత్వం కొన్ని అధికారాలను సర్పంచ్ ల నుంచి వీఆర్వోలకు బదిలీ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఇది రాష్ట్ర హైకోర్టులో తప్పుగా గుర్తిస్తూ కొట్టివేయబడింది.

సంక్షేమ పథకాల అమలును తీవ్రతరం చేయడానికి మాత్రమే వీఆర్వోలకు ఎక్కువ అధికారాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం వాదించింది. వీఆర్వోలకు అధికారాలు బదిలీ చేయడం వల్ల పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రభావితం కాదని తెలిపింది.

కానీ హైకోర్టు ప్రభుత్వ వాదనతో ఏకీభవించలేదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 72ను ఉల్లంఘించినట్టు పేర్కొంది. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకు కొన్ని అధికారాలను బదలాయించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.