Begin typing your search above and press return to search.
జగన్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు తీర్పు
By: Tupaki Desk | 26 Aug 2022 3:19 PM GMTవైఎస్ జగన్ కి భారీ ఊరటని ఇచ్చే విషయంగా దీన్ని చెప్పుకోవాలి. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఎక్కువ ఉన్నాయని సీబీఐ ఇప్పటికి పుష్కర కాలం క్రితం పెట్టిన కేసులలో సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హోదాలో విచారణకు హాజరు కాకుండా తెలంగాణా హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అంటే ప్రతీ సారీ విచారణ సందర్భంగా జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదన్న మాట.
దీంతో జగన్ కి ఇది శుభవార్తగానే అంతా భావిస్తున్నారు. ఈ కేసు విషయంలో సీబీఐ చాలా పట్టుదలగా ఉండి హైకోర్టులో తన వాదన వినిపించింది. జగన్ వ్యక్తిగత హోదాలో విచారణకు ప్రతీ వాయిదాకు కోర్టు ముందుకు రావాల్సిందే అని పేర్కొంది. ఆ విధంగా జగన్ కోర్టుకు హాజరయ్యేలా ఆదేశించాలి అంటూ కోరింది. అయితే జగన్ దీని మీద తన వైపు నుంచి పిటిషన్ దాఖలు చేసుకున్నారు
తాను ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని, ప్రతీ రోజూ విచారణకు కోర్టుకు హాజరు కావడం అంటే తనకు పాలనాపరమైన ఆటంకాలు ఎదురవుతాయని కోర్టుకు తెలియచేశారు. అందువల్ల తనకు బదులుగా తన న్యాయవాది కోర్టు ముందు హాజరవుతారని ఆయన తన పిటిషన్ ద్వారా విన్నవించుకున్నారు.
అయితే జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మరింతగా సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి ఎలాంటి మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ తరఫున న్యాయవాదులు వాదించారు. అయితే జగన్ తరఫున న్యాయవాదులు ప్రతీ రోజూ విచారణకు సీఎం హోదాలో ఆయన హాజరైతే పాలనపరమైన ఇబ్బందులు ఉంటాయని వివరించారు.
ఈ కేసు విచారణ అన్నది గత డిసెంబర్ లో జరిగింది. ఆనాడు తెలంగాణా హై కోర్టు అన్ని వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజున హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. దీంతో జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. అయితే సీబీఐ కోర్టు ఎపుడు అవసరం అనుకుని పిలిస్తే మాత్రం అపుడు తప్పకుండా హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది.
ఇదిలా ఉండగా ఇంతకు ముంది సీబీఐ కోర్టులో దీని మీద జగన్ పిటిషన్ దాఖలు చేయగా వ్యక్తిగతంగా హాజరు కావలసిందే అంటూ జగన్ పిటిషన్ని కొట్టేసింది. దాంతో హైకోర్టుకు జగన్ వెళ్ళి తన వాదన వినిపించారు. ఇపుడు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో జగన్ తరఫున న్యాయవాది, ఇటీవలనే రాజ్యసభ మెంబర్ అయిన నిరంజన్ రెడ్డి జగన్ సీబీఐ కేసుల విచారణకు సీబీఐ కోర్టుకు హాజరవుతారు.