Begin typing your search above and press return to search.
అత్యధిక లీగల్ డిమాండ్లు భారత్ నుంచే.. తేల్చిన ట్విటర్
By: Tupaki Desk | 30 July 2022 4:17 AM GMTఏదైతే తన ప్రచార అస్త్రంగా.. ఇమేజ్ ను పెంచుకోవటానికి సాయం చేసిందో.. ఇప్పుడదే మాధ్యమం తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టటాన్ని నరేంద్ర మోడీ అస్సలు ఇష్టపడటం లేదా? సోషల్ మీడియా వ్యాప్తి మాంచి జోరు మీద ఉన్న వేళ.. దాన్నో అస్త్రంగా వాడుకొని అధికారంలోకి వచ్చినట్లుగా మోడీ వ్యతిరేకులు తరచూ ఆరోపిస్తుంటారు. ఎన్నికలకు కాస్త ముందుగా సోషల్ మీడియాను బలమైన అస్త్రంగా వినియోగించుకొని.. పెద్ద సంఖ్యలో ప్రజల్ని ఆకర్షించినట్లుగా చెబుతారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా భారత రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ.. ప్రజల అభిప్రాయాల్ని ప్రభావితం చేసే వరకు వెళ్లటం తెలిసిందే.
ఇలాంటివేళ.. తమకు.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గళం విప్పితే.. వారి మీద చర్యల కొరడాను విదిల్చేలా మోడీ సర్కారు వ్యవహరిస్తుందన్న విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా లీగల్ గా కూడా వెళుతున్నట్లుగా చెబుతున్నారు.
ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా ట్విటర్ విడుదల చేసిన నివేదికలోని అంశాలు ఉన్నట్లు చెబుతున్నారు. 2021 జులై - డిసెంబరు మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా తమకు మొత్తం 326 లీగల్ డిమాండ్లు వచ్చాయని.. వాటిల్లో అత్యధికం భారత ప్రభుత్వం నుంచే 114 డిమాండ్లు వచ్చినట్లుగా ట్విటర్ వెల్లడించింది.
అదే సమయంలో గత ఏడాది జనవరి - జూన్ మధ్యన నడిచిన ఆర్నెల్ల కాలంలో 89 లీగల్ డిమాండ్లు వస్తే.. తర్వాతి ఆర్నెల్ల కాలంలో మరింతగా డిమాండ్ల సంఖ్య పెరిగినట్లుగా పేర్కొంది. అంతేకాదు.. యూజర్ల సమాచారాన్ని కూడా తమకు ఇవ్వాలని భారత్ తమను ఆదేశిస్తున్నట్లుగా ట్విటర్ వెల్లడించింది. ఇలాంటి అభ్యర్థనలు ప్రపంచ వ్యాప్తంగా 11,460 వస్తే.. ఇందులో ఒక్క భారత్ నుంచే 2,211 అభ్యర్థనలు వచ్చినట్లుగా ట్విటర్ నివేదిక పేర్కొంది.
అంతేకాదు.. గడిచిన ఆర్నెల్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ లో పోస్టు చేసిన అభ్యంతరకర కంటెంట్ ను తొలగించాల్సిందిగా 47,572 వినతులు వస్తే.. ఒక్క భారత్ నుంచే అవి కాస్తా 3992 అందినట్లుగా చెప్పారు. మూడేళ్లలో అత్యధిక లీగల్ డిమాండ్లు చేసే దేశాల జాబితాలో భారత్ తో పాటు.. జపాన్.. రష్యా.. దక్షిణ కొరియా.. టర్కీ దేశాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. కొన్ని ట్విటర్ ఖాతాల్ని బ్లాక్ చేయాలని కేంద్రం తమకు తరచూ ఆర్డర్లు జారీ చేస్తున్నారని చెప్పింది.
రాజకీయ.. మీడియాకు సంబంధించిన వెబ్ సైట్ లింకుల్ని కూడా తొలగించాలని చెప్పినట్లుగా కర్ణాటక హైకోర్టులో ట్విటర్ ఈ మధ్యన దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొనటం గమనార్హం. మొత్తంగా ఏ సోషల్ మీడియాను స్ట్రాంగ్ వాడేసిన మోడీ.. ఇప్పుడదే మాథ్యమంలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాలన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ట్విటర్ నివేదిక నేపథ్యంలో బీజేపీ నేతలు ఎవరైనా రియాక్టు అవుతారేమో అన్నది ఆసక్తికరంగా మారింది.