Begin typing your search above and press return to search.
రోడ్డు ప్రమాదాల మృతుల్లో అత్యధిక శాతం యువతే.. కేంద్రం తాజా నివేదిక!
By: Tupaki Desk | 7 Jun 2022 3:47 AM GMTదేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నవారిలో అత్యధిక శాతం మంది యువతేనని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదిక పేర్కొంది. 2018 నుంచి 2020 వరకు మూడేళ్లలో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నమోదైన మృతుల సంఖ్యలో యువతే ఎక్కువ శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల ఉత్పాదక వయసు గల మానవ వనరులను కోల్పోతున్నట్టు 2020 సంవత్సరానికి రహదారి ప్రమాదాలపై కేంద్రం విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. 2018 నుంచి 2020 వరకు దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 69 శాతం మంది యువత ప్రాణాలు కోల్పోయినట్టు నివేదిక వెల్లడించింది.
కాగా, 2018-2019 సంవత్సరాలతో పోలిస్తే.. 2020లో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య తగ్గింది. దేశంలో 2018లో రోడ్డు ప్రమాదాల్లో 1,51,417 మంది మృతి చెందగా.. ఈ సంఖ్య 2019లో స్వల్పంగా తగ్గింది. 2019లో 1,51,113 మంది మృత్యువాత పడ్డారు.
అలాగే 2020లో మృతుల సంఖ్య 1,31,714కు తగ్గింది. అలాగే 2020లో దేశంలో జరిగిన రహదారి ప్రమాదాల్లో 18 నుంచి 60 ఏళ్ల వయసు గల వారు 85.7 శాతం మృతి చెందినట్టు నివేదిక వెల్లడించింది. 2020 రహదారి ప్రమాదాల్లో 18 ఏళ్లలోపు వారు 37.3 శాతం మరణించినట్టు నివేదిక పేర్కొంది. 2019తో పోలిస్తే 2020లో 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు గలవారి మరణాలు 16.8 శాతం తగ్గినట్టు నివేదిక వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో 2019 సంవత్సరంతో పోలిస్తే 2020లో రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గింది. 2019లో 21,992 రోడ్డు ప్రమాదాల్లో 7,984 మంది మృతి మరణించారు. ఇక 2020లో 19,509 రోడ్డు ప్రమాదాల్లో 7,039 మంది మృతి చెందారు. రహదారి ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య తగ్గినప్పటికీ 2020లో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారిలో అత్యధిక మంది యవతే కావడం ఆందోళన కలిగిస్తోంది. 2020లో రోడ్డు ప్రమాదాల్లో మృత్యవాత పడ్డ వారిలో ఎక్కువ మంది 18 నుంచి 45 ఏళ్లలోపు వారేనని నివేదిక పేర్కొంది.
2020లో ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాల్లో 5,909 మంది పురుషులు మరణించగా 1,130 మంది మహిళలు మృత్యువాత పడ్డారు. 18 నుంచి 25 ఏళ్లలోపు వారిలో పురుషులు 1,007 మంది, మహిళలు 131 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. అలాగే 25 నుంచి 35 ఏళ్లలోపు వారిలో పురుషులు 1,424 మంది, మహిళలు 220 మంది ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు.
అదేవిధంగా 35 నుంచి 45 ఏళ్లలోపువారిలో పరుషులు 1,329 మంది, మహిళలు 231 మంది మరణించారు. ఇక 45 నుంచి 60 ఏళ్లలోపువారిలో పరుషులు 1,158 మంది, మహిళలు 272 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. కాగా 60 ఏళ్లు పైబడినవారిలో పురుషులు 617 మంది, మహిళలు 174 మంది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.