Begin typing your search above and press return to search.
హిందూ మహాసభకు పిచ్చి పీక్స్ నా?
By: Tupaki Desk | 23 Nov 2022 6:31 AM GMTహిందూ మహాసభకు పిచ్చి పీక్స్‌కు చేరిందని నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. హిందూ మహాసభ నిర్ణయంపై మండిపడుతున్నారు. నెటిజన్లు ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఉంది.
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం నగరపాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరట్ నగరంలో తమ పార్టీ అభ్యర్థి మేయర్‌గా గెలుపొందితే ఈ నగరం పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తామని హిందూ మహాసభ ప్రకటించడమే నెటిజన్ల ఆగ్రహానికి కారణం.
కేవలం మీరట్ నగరం పేరు మార్చడమే కాకుండా ఆ నగరంలోని ముఖ్య ప్రాంతాలన్నింటికీ హిందూ నేతల పేర్లు పెడతామని హిందూ మహాసభ ప్రకటించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హిందూ మహాసభ ఓ మేనిఫెస్టోను కూడా ఇప్పటికే విడుదల చేసింది.
భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని హిందూ మహాసభ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే గోమాతను కాపాడుకుంటామని కూడా మేనిఫెస్టోలో పేర్కొంది.
"వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మా పార్టీ హిందూ మహాసభకు తగినన్ని కౌన్సిలర్ సీట్లు వచ్చి మా అభ్యర్థి మేయర్ అయితే మీరట్ నగరం పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తాం. నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా హిందూ నేతల పేర్లు పెడతాం" అని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు పండిట్ అశోక్ శర్మ ప్రకటించారు.
కాగా మీరట్ నగరపాలక సంస్థలో అన్ని వార్డులకూ పోటీ చేస్తున్నామని హిందూ మహాసభ మీరట్ జిల్లా అధ్యక్షుడు అభిషేక్ అగర్వాల్ తెలిపారు. దేశభక్తి కలిగిన వారికే తమ పార్టీ తరఫున టికెట్లు ఇస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ బీజేపీ, శివసేనపై విమర్శలు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ హిందువుల పార్టీ అయినప్పటికీ ఆ పార్టీలో ఇతర వర్గాలకు చెందిన వారి సంఖ్య పెరిగిందని విమర్శించారు. శివసేన సైతం ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీలూ వాటి ఐడియాలజీకి దూరమవుతున్నాయని ఆరోపించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.