Begin typing your search above and press return to search.

అమెరికా ఎన్నికల్లో మన 'నబీలా సయ్యద్' చరిత్ర

By:  Tupaki Desk   |   11 Nov 2022 6:01 AM GMT
అమెరికా ఎన్నికల్లో మన నబీలా సయ్యద్ చరిత్ర
X
భారతీయ సంతతి అమెరికాలో అగ్రభాగాన నిలుస్తున్నారు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారీస్ మన ప్రవాస భారతీయురాలే. తమిళనాడు మూలాలున్న వ్యక్తి ఆమె. ఈమెనే కాదు.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా మనోడే. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా మన భారతీయులే ఉంటున్నారు. అక్కడి రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ భారతీయులు సత్తా చాటుతున్నారు. 23 ఏళ్ల వయస్సున్న నబీలా సయ్యద్ ఇల్లినాయిస్ రాష్ట్ర జనరల్‌కు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇలా ఎన్నికైన అతి పిన్న వయస్కురాలు సలీలా కావడం విశేషం.

"నా పేరు నబీలా సయ్యద్. నేను 23 ఏళ్ల ముస్లిం, భారతీయ-అమెరికన్ మహిళ" అని ఆమె బుధవారం ఒక ట్వీట్‌లో ప్రకటించింది. "మేము ఇప్పుడే రిపబ్లికన్ ఆధీనంలో ఉన్న సబర్బన్ జిల్లాను గెలుచుకున్నామని సలీలా ప్రకటించింది. జనవరిలో నేను ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలిగా ఎంట్రీ ఇస్తున్నానంటూ పేర్కొంది. "ఇది వాస్తవంగా అనిపించడం లేదు. కానీ నేను ఇప్పుడు ఎన్నికైన రాష్ట్ర ప్రతినిధిని. నేను జనరల్ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలిని" అంటూ ఉప్పొంగిపోయింది.

ఇల్లినాయిస్ స్టేట్ హౌస్‌కు ఎన్నికైన మొదటి భారతీయ-అమెరికన్ ఈమెనే కావడం విశేషం. పాలస్తీనా-అమెరికన్ అబ్దెల్ నాసర్‌తో కలిసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తొలి ముస్లిం రషీద్. నబీలా సయ్యద్ హిజాబ్ ధరించి ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలవడం విశేషం.

ఇక సయ్యద్ ఇల్లినాయిస్‌లో జన్మించింది. కానీ ఆమె కుటుంబం గురించి, ఆమె తల్లిదండ్రులు లేదా వారిలో ఒకరు కనీసం భారతదేశం నుండి వచ్చిన వారి గురించి వివరాలు వెల్లడించలేదు.

సయ్యద్ ప్రచార వెబ్‌సైట్ ప్రకారం.. ఆమె బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ , బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టభద్రురాలైంది, అక్కడ ఆమె స్థానిక వ్యాపారాలు.. లాభాపేక్షలేని సంస్థలకు సహాయం చేసే ప్రో-బోనో కన్సల్టింగ్ సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేసింది.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌లో మొదటి తరం సభ్యురాలిగా చరిత్రలో నబీలా నిలిచిపోతుంది. తమ వంతు కోసం ఎదురుచూడకుండా, రాజకీయాల్లో తమ స్థానాన్ని పొందేందుకు యువకులు చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా సయ్యద్ కూడా పోటీచేసి గెలిచారు. శాసన ప్రక్రియలో బలమైన వాయిస్ ఉండేలా వీరందరూ చాటిచెప్పనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.