Begin typing your search above and press return to search.

నవ వధువుకు తొలిరాత్రే కాలరాత్రి.. నరకం చూపించిన భర్త

By:  Tupaki Desk   |   22 Dec 2020 12:43 PM GMT
నవ వధువుకు తొలిరాత్రే కాలరాత్రి.. నరకం చూపించిన భర్త
X
ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువు ఆశలు అడియాశలయ్యాయి. కట్టుకున్న వాడితో ఊసులు , బాసలు పంచుకోవాలని తొలి రాత్రికి రెడీ అయిన ఆ నవవధువుకు ఆ రాత్రి కాళరాత్రిగా మారింది. గుంటూరు జిల్లాలో ఓ యువతికి తొలి రాత్రి భర్త ప్రవర్తనతో షాక్ కు గురైంది. అతడి వికృత చేష్టలకు తీవ్ర గాయాలపాలైంది. భర్త పైశాచికత్వంపై పోలీసులను ఆశ్రయించింది.

ప్రకాశం జిల్లాకు చెందని యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన యువతి కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో అక్టోబర్ నెలలో వీరికి వివాహమైంది.

ఈ క్రమంలోనే కోటి ఆశలతో ఫస్ట్ నైట్ కు చెందిన అయిన నవవధువుకు మొదటి రాత్రి కాళరాత్రి అయ్యింది. భర్త విపరీతంగా ప్రవర్తించాడు. కొద్దిరోజుల కింద ఫస్ట్ నైట్ జరపగా అతడు భయపడుతున్నాడని వధువు ఊరుకుంది. రెండు రోజుల కిందట మళ్లీ శోభనం ఏర్పాటు చేశారు.

ఇక్కడే అసలు రంగును వరుడు బయటపెట్టాడు. వధువు నైటీ వేసుకొని బెడ్ రూంలో వింతగా ప్రవర్తించాడు. ఆమెకు మత్తు మందు ఇంజెక్షన్ వేసి బ్లేడ్ తో ఆమె జననాంగాల్లో శరీరంపై కోసాడు. రక్తపు చారలతో బయటకొచ్చిన వధువు తన కుటుంబ సభ్యులకు తెలిపింది.

ఇక వరుడి బంధువులు మాత్రం వధువే సంసారానికి పనికి రాదంటూ గొడవ చేశారు. గాయాలతో వధువును ఆమె తల్లిదండ్రులు గుంటూరు రూరల్ ఎస్పీ దగ్గరకు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. చికిత్స నిమిత్తం వధువును తరలించిన పోలీసులు.. ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.