Begin typing your search above and press return to search.
షాకింగ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్...ఆ 40 మందికి కరోనా పాజిటివ్ ఎలా వచ్చిందంటే?
By: Tupaki Desk | 11 April 2020 7:50 AM GMTకరోనా వైరస్ చైనాలో వెలుగులోకి వచ్చిన వైరస్ ...ఈ మహమ్మారి విదేశాల నుండి వచ్చిన వారి వల్లే ఇండియాలోకి ప్రవేశించింది. అయితే , విదేశాల నుండి రాలేదు ...విదేశాల నుండి వచ్చిన వారితో సంబంధం లేదు .. ఆరోగ్య - పారిశుధ్య సిబ్బందితోనూ సంబంధాలు లేవు - లేబొరేటరీల్లోనూ పని చేయలేదు. కానీ, కరోనా నిర్దారణ పరీక్షల్లో 40 మందికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఇదే ఇప్పుడు కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా వైరస్ .. ఖచ్చితంగా - కరోనా సోకినా వ్యక్తుల నుండి కానీ, విదేశాలలో తిరిగి వచ్చిన వారి నుండి కరోనా సోకే అవకాశం ఉంది. కానీ, ఈ రెండు పద్దతులలో వారికీ కరోనా సోకలేదు. కానీ , కరోనా పాజిటివ్ అని తేలింది.
భారత్ లో కరోనా వ్యాప్తిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వే ఫలితాలు ప్రభుత్వాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఎంపిక చేసిన 5,911 మందికి ఐసీఎంఆర్ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించింది. వారిలో 104 మందికి కరోనా పాజిటివ్ రాగా - వీరిలో 40 మందికి కరోనా వ్యాధి సోకిన వారితో పరోక్షంగా కానీ - ప్రత్యక్షంగా కానీ సంబంధాలు లేకపోవడం - విదేశాల నుంచి వచ్చిన చరిత్ర లేకపోవడంతో ప్రభుత్వం షాక్ అవుతుంది.
దేశంలోని 20 రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాల్లోని 52 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు తాజాగా ఐసీఎంఆర్ విడుదల చేసింది. తీవ్రమైన శ్వాస కోశ సమస్యలతో బాధపడే రోగులకు మార్చి 14 కంటే ముందు కరోనా వైరస్ అసలు సోకలేదు. అదే ఏప్రిల్ 2 వచ్చేసరికి అలాంటి వారిలో 2.6% మందికి కరోనా సోకింది. 50 ఏళ్లకు పైబడినవారిలోనూ - పురుషులపైనా ఈ వైరస్ పంజా విసురుతోంది. 50–59 ఏళ్ల మధ్య వయస్కుల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఎస్ ఏ ఆర్ ఐ రోగుల్లో 5,911 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 104 మందికి (1.4%) కరోనా ఉన్నట్టు నిర్దారణ అయ్యింది. ఈ కరోనా కేసుల్లో 40 మంది విదేశీ ప్రయాణాలు - విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధాలు లేకపోయినా వైరస్ సోకింది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో ఇలాంటి కేసులున్నాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ కరోనా బారిన పడిన వారిలో గుజరాత్ నుంచి అత్యధికంగా కేసులు (792) నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు (577) - మహారాష్ట్ర (533) - కేరళ (503) ఉన్నాయి. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇవే కావడం గమనార్హం.
మొత్తంగా దేశ వ్యాప్తంగా 36 జిల్లాల్లో కరోనా రోగులతో ఎలాంటి లింకులు లేకపోయినా కరోనా వ్యాపించడంతో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలని ప్రభుత్వానికి తెలిపారు. ఇదే భారత్ లో సమూహ వ్యాప్తికి సంకేతమని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్ అభిప్రాయ పడ్డారు. అలాగే ఇప్పటినుండే ప్రజలందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.