Begin typing your search above and press return to search.

మిస్ అయిన ఎన్టీవీ రిపోర్టర్ ఘటన విషాదాంతం

By:  Tupaki Desk   |   15 July 2022 1:14 PM GMT
మిస్ అయిన ఎన్టీవీ రిపోర్టర్ ఘటన విషాదాంతం
X
ఎన్టీవీ రిపోర్టర్ మిస్సింగ్ విషాదాంతమైంది. గత రెండు రోజుల క్రితం గోదావరి వరద బీభత్సాన్ని కవర్ చేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్ వరదలో గల్లంతైన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామోజీపేట వాగులో కారుతో గల్లంతైన రిపోర్టర్ జమీర్ మృతదేమం శుక్రవారం లభ్యమైంది. రామోజీపేట భూపతిపూర్ మధ్యలో శుక్రవారం ఉదయం జమీర్ కారును గుర్తించి బయటకు తీశారు.

అక్కడికి కొద్దిదూరంలో చెట్ల కొమ్మలో చిక్కుకున్న జమీర్ మృతదేహాన్ని రెస్క్యూటీం గుర్తించింది. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామోజీపేట-భూపతిపూర్ గ్రామాల వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లుతోంది.

మూడు రోజుల క్రితం షిఫ్ట్ డిజైర్ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ కారులో న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మార్గమధ్యలో రామోజీపేట వాగు మీదుగా కారులో వస్తుండగా నీటి ప్రవాహం ఎక్కువైంది. వరద దాటికి జమీర్ ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది.

మంగళవారం రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినా కారు ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఎట్టకేలకు జమీర్ ఆచూకీ లభ్యమైంది. శుక్రవారం ఉదయం కారుతో సహా జమీర్ ను బయటకు తీశారు. చెట్టు కొమ్మకు జమీర్ మృతదేహం కనిపించడంతో ప్రాణాలు తెగించి రెస్క్యూటీం జమీర్ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు.

జమీర్ మృతితో కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. జమీర్ మరణం పట్ల పలువురు పాత్రికేయులు సంతాపం తెలిపారు. కాగా.. జమీర్ తోపాటు కారులో ప్రయాణించిన స్నేహితుడు లతీఫ్ ఓ చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.