Begin typing your search above and press return to search.

'ది ఇండిపెండెంట్' సంచలనం.. పుతిన్ బతికేది మూడేళ్లేనట!

By:  Tupaki Desk   |   31 May 2022 6:30 AM GMT
ది ఇండిపెండెంట్ సంచలనం.. పుతిన్ బతికేది మూడేళ్లేనట!
X
నాగరిక ప్రపంచానికి అవసరం లేని యుద్దాన్ని తన పేరాశతో రుద్దేసిన రష్యా అధినేత పుతిన్ గురించి తెలిసిందే. రష్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ నియంత.. తన కోసం రష్యా చట్టాల్ని మార్చేసి.. తనకు అనుకూలంగా మార్చేసుకోవటం తెలిసిందే.

జీవితకాలం తానే రష్యా అధ్యక్షుడిగా ఉండేలా తయారు చేసుకున్న చట్టంపై రష్యాలో నిరసన వ్యక్తమవుతున్నా.. తనను విబేధించేవారు ఎవరైనా సరే.. ప్రాణాలు లేకుండా చేయటమో లేదంటే కేసుల ఉచ్చులో పడి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయటం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ తో యుద్ధానికి దిగి.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి తెర తీశారని చెప్పాలి.

ఇలాంటి పుతిన్ బతికేది మరో మూడేళ్లు మాత్రమేనంటూ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది 'ది ఇండిపెండెంట్' మీడియాయ సంస్థ. మూడేళ్లకు మించి ఆయన బతికే ఛాన్సు లేదని తేల్చేసింది.

ఈ కథనానికి సంబంధించిన వివరాల్ని రష్యాన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారి తమకు కీలక సమాచారాన్ని ఇచ్చినట్లుగా పేర్కొంది. ఈ కీలక వివరాల్ని బ్రిటన్ లో ఉంటున్న రష్యా మాజీ గూఢాచారి ఒకరికి ఒక మెసేజ్ ద్వారా తెలుసుకున్నట్లుగా పేు్కొంది.

అంతేకాదు.. పుతిన తన కంటిచూపును వేగంగా కోల్పోతున్నట్లుగా ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే.. పుతిన అనారోగ్యంపై వస్తున్న కథనాల్ని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కొట్టేస్తున్నారు. ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నారు. మరోవైపు ఆయన పలు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా ఒకటి తర్వాత ఒకటి చొప్పున మీడియా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

విదేశాంగ మంత్రి చెబుతున్న మాటలకు.. వాస్తవానికి పొంతన లేదన్న మాట వినిపిస్తోంది. టీవీల ముందుకు వచ్చిన సందర్భంగా పుతిన్ ఒక పేజీలో కేవలం రెండు లైన్లు మాత్రమే ఉన్న సందేశాన్ని రాసి ఉంచుతున్నారని..ఆయన చూపు మందగించిందని చెప్పటానికి ఇదో నిదర్శనమని చెబుతున్నారు. 69 ఏళ్ల పుతిన్ అవయువాల మీద నియంత్రణ కోల్పోయి వణుకుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా పుతిన్ ఆరోగ్య అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.