Begin typing your search above and press return to search.

అయ్యో పాపం .. ప్లాస్టిక్ ట్రే లో 7 నెలల చిన్నారి !

By:  Tupaki Desk   |   18 Aug 2021 6:30 AM GMT
అయ్యో పాపం .. ప్లాస్టిక్ ట్రే లో 7 నెలల చిన్నారి !
X
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని తాలిబన్ల నియంత్రణలోకి వచ్చినప్పటి నుండి అక్కడ అనేక భయంకరమైన దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాలిబన్ల పరిపాలన నుంచి వందలాది మంది పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో కొందరు
తమ ప్రాణాలని కూడా పోగొట్టుకుంటున్నారు. ఇకపోతే , ఇప్పటికే కాబూల్ విమానాశ్రయం మూసివేసే ముందు అక్కడ నిలిచిపోయిన టాక్సీలు, ప్రజలు కాబూల్ నుండి బయలుదేరే చివరి విమానాలను ఎక్కడానికి ప్రయత్నించడంతో జరిగిన తొక్కిసలాట, గందరగోళ పరిస్థితులకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి.

అందులో కొంతమంది గాలిలోకి ఎగిరిన విమానం నుంచి కింద పడి మరణించడం బాధాకరం. తాలిబన్ల ఆక్రమణ తరువాత అఫ్గన్‌ పౌరుల్లో తీరని భయం నెలకొంది. ప్రాణభయంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లో అనేక భయంకరమైన దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా పలువుర్నికలవర పెడుతున్నాయ. ముఖ్యంగా దేశం విడిచి ఎలాగైనా పారిపోవాలన్న ఆతృతలో కాబూల్ విమానాశ్రయానికి వందలాది మంది క్యూకట్టారు. ఈ తొక్కిసలాట గందరగోళానికి తోడు గాలిలో నుండి ఇద్దరు వ్యక్తులు ఆకాశం నుండి కిందపడిపోయిన దృశ్యాలు అత్యంత బాధాకరంగా నిలిచాయి.

ఆగస్టు 17న మరొక హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఇది కాబూల్ విమానాశ్రయంలో జరిగిన గందరగోళానికి సంబంధించిందే. ఈరోజు సోషల్ మీడియాలో ప్లాస్టిక్ క్రేట్‌ లో ఓ చిన్నారి ఏడుస్తూ కన్పించడం అందరినీ కదిలించి వేసింది. అనారోగ్యంతో ఉన్న శిశువు 7 నెలల వయస్సు గల పాప ఒక్కతే ఏడుస్తూ కన్పించింది. ఆమె తల్లిదండ్రులు నిన్న జరిగిన గందరగోళంలో కనిపించకుండా పోయారని తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక న్యూస్ ఏజెన్సీ ప్రకారం శిశువు తల్లిదండ్రులు పిడి-5, కాబూల్‌లో నివసిస్తున్నారని, ఆ పాపను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడానికి వారు సహాయం చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ అగ్ర రాజ్యాలపై, అంతర్జాతీయ ఏజెన్సీలపై ఫైర్ అవుతున్న నెటిజన్లు ఈ పిక్ బాధించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లు మానవ విపత్తుపై మౌనం వహించడంలో అర్థం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దీనిపై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ ప్రజలను రక్షిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడంలో తాలిబన్ల వైఫల్యం అంటూ ఒకరు, ఇది తాలిబన్ల వైఫ్యలం, పిల్లలను రక్షించలేని విజయం విజయం కాదంటూ మరికొరు మండి పడుతున్నారు.

అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోకి తాలిబన్‌లు ప్రవేశించడంతో దేశం మొత్తం వారి అధీనంలోకి వెళ్లింది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. అఫ్గన్‌లో యుద్ధం ముగిసిందని, పూర్తిగా అధికారం సొంతమైందని తాలిబన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తదుపరి లక్ష్యం ఏంటి? ఏం చేయబోతున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అయితే, అఫ్గన్‌ను తాము స్వాధీనం చేసుకున్న తరువాత ప్రభుత్వ పాలనలో ఎటువంటి పరివర్తన ఉండదని తాలిబన్‌కు చెందిన ప్రతినిధులు వ్యాఖ్యానించారు.