Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో కీలక తీర్మానాలు..కేంద్రానికి షాక్!

By:  Tupaki Desk   |   17 Jun 2020 4:00 PM GMT
ఏపీ అసెంబ్లీలో కీలక తీర్మానాలు..కేంద్రానికి షాక్!
X
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2020-21కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు - సంతాప తీర్మానాలు చేసింది.

ఈక్రమంలోనే కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద ఎన్పీఆర్ - ఎన్నార్సీ లను ఏపీలో అమలు చేయబోమని జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి మరీ కేంద్రానికి పంపించింది.

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఈ బిల్లును ప్రవేశపెట్టగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. మైనార్టీల సంక్షేమం విషయంలో ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేయదని వారి సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అంజాద్ బాషా తెలిపారు..

ఈ సందర్భంగా చైనా సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు ఏపీశాసన సభ బుధవారం సంతాపం తెలిపింది. జవాన్ల మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సంతాప తీర్మాణాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. తెలుగు వాడు సూర్యపేటకు చెందిన కల్నాల్ సంతోష్ బాబు త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు.